తాగి షో లో రచ్చ చేసిన నటి ఊర్వశి.. నోటీసులు | Senior Actress Drinking Habit Put her into trouble

Senior actress misbehaves on television show

Actress Urvashi, Urvashi Drunk, Urvashi Driniking Habit, Urvashi TV Show, Urvashi Family Show Drunk, Actress Urvashi Scold Participates, Kerala Controversy Show, Senior Actress Drinking Habit,Rachabanda Anchor Rude Behaviour, family Shows Rude Behaviour Vulgar Abuse

Actress Urvashi is making headlines for wrong reasons again. The Kerala State Human Rights Commission has now sought an explanation from a Malayalam Television channel upon an earlier complaint that actor Urvashi allegedly misbehaved and insulted participants in family Show.

ఫ్యామిలీ షోలో నటి ఊర్వశి రచ్చ.. రచ్చ

Posted: 07/18/2017 01:00 PM IST
Senior actress misbehaves on television show

మధ్యాహ్నం అయ్యిందంటే చాలూ తెలుగు ఛానెళ్లన్ని వరుసబెట్టి ఒకే జోనర్ ఆఫ్ కార్యక్రమాలను ప్రసారం చేస్తుంటాయి. మీ కాపురంలో కలతలు ఉంటే రండి మేం చక్కబెడతాం అంటూ బ్యాగ్రౌండ్ స్కోర్ లో ఓ పాటేసుకుని వచ్చే వాటి ద్వారా సమస్య పరిష్కారం ఏమోగానీ ఓ ఇంటి పరువును మాత్రం బజారు కీడుస్తున్నారన్న విషయం ఖచ్ఛితంగా చెప్పొచ్చు. శవాల మీద డబ్బులు ఏరుకోవడమే అంటూ సింపుల్ గా ఒక్క మాటలో వాటి ఉద్దేశం తన అభిప్రాయ రూపంలో చెప్పేశాడు యండమూరి వీరేంద్ర నాథ్. అయితే ఇలాంటి షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సీనియర్ నటి వ్యవహారం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సీనియర్ నటి ఊర్వశి మళయాళంలో ఇలాంటి ఫ్యామిలీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఆమె చేసిన వ్యాఖ్యలతో తన భర్తతో విభేదాలు పెరిగి, కాపురం కూలిపోయే స్థితికి చేరుకుందని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయటం విశేషం. కొన్నాళ్ల క్రితం విభేదాలతో సతమతమవుతున్న ఓ జంట రాగా, వారి మధ్య గొడవలను తగ్గించాల్సింది పోయి, నోటికి వచ్చినట్టు ఊర్వశి మాట్లాడిందంట. దీంతో భర్త విడిపోయేందుకు సిద్ధమైపోయాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే ఆ షోకు ఆమె తాగి వచ్చిందని మహిళ ఫిర్యాదులో పేర్కొనటం విశేషం. బూతు ను కంట్రోల్ చేయలేమా?

ఇది ఆమెకు కొత్తేం కాదు. ఇంతకు ముందు ఇదే షోలో ఓసారి ఇలాగే తాగొచ్చి రచ్చ చేసింది. గతేడాది కేరళ అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి తాగొచ్చి ప్రసంగించగా, అధకారులు ఆమెను ఆపి పంపించేశారు. ఆ సమయంలో ఏకంగా మానవ హక్కుల సంఘం కలగజేసుకుని నోటీసులు పంపి షో నిర్వాహకులను వివరణ కోరింది. ఇక ఇప్పుడు మరోసారి తాగి టీవీ షోలో రచ్చ చేసి ఏకంగా పోలీస్ స్టేషన్ కు పంచాయితీ చేరింది. మానసికంగా ఆనందంగా ఉండే వాళ్లెవ్వరూ ఇలాంటి షోలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది కొందరు చెప్పేది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Urvashi  Drunk and Scold  TV Show  

Other Articles