Bharath Death Ravi Teja Fires On Social Media

Raviteja response about his brother bharath accident

Ravi Teja, Actor Ravi Teja, Ravi Teja Brother Death, Ravi Teja About Brother Death, Ravi Teja on Rumours, Actor Ravi Teja, Ravi Teja explained Skip bharath Funeral, Ravi Teja About Shooting, Ravi Teja Smiling Selfie, Ravi Teja Fire on Media, Ravi Teja Bharath Relation, Ravi Teja Social Media

Actor Ravi Teja interact with media about brother Bharath death and why skip funeral with media. Fire on Social Media about fake news. Humble request to media to not write certain news.

భరత్ మరణం.. వివాదాలపై నోరు విప్పాడు

Posted: 07/05/2017 03:38 PM IST
Raviteja response about his brother bharath accident

సోదరుడు భరత్ అంత్యక్రియలకు హాజరుకాకపోవటంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ టాప్ హీరో రవితేజ స్పందించాడు. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమానికి మాస్ రాజా హాజరయ్యాడు. ఈ సందర్భంగా మీడియాకి చిక్కటంతో వివరణ ఇచ్చుకున్నాడు. తన సోదరుడ్ని ఆ స్థితిలో చూడలేకే తాను, కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు వెళ్లలేదని తెలిపాడు. తమ్ముడంటే ఎవరికి ప్రేమ ఉండదని అడిగాడు. తమ భావాలేంటో తెలుసుకోకుండా తమపై అవాస్తవ కథనాలు ప్రచురించడం సరైన విధానం కాదని తెలిపాడు.

తన మరో సోదరుడు రఘు, తమ సొంత చిన్నాన్న కలసి అంత్యక్రియలు పూర్తి చేశారని, కానీ, జూనియర్ ఆర్టిస్ట్ కు డబ్బులిచ్చి చేయించినట్లు కొందరు కథనాలు రాయటం దారుణమన్నాడు. సినిమా షూటింగ్ కు తప్పనిసరి పరిస్థితుల్లో హాజరుకావాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు. నవ్వుతూ చిత్ర యూనిట్ తో సెల్ఫీ దిగటంపై చుట్టూ పది మంది ఉన్నప్పుడు చిరునవ్వు సహజమని అన్నాడు. తానొక్కడినే షూటింగ్ ఎగ్గొడితే మిగిలిన 15 మంది డేట్స్ అడ్జెస్ట్ చేయడం చాలా కష్టమైన పని అని రవితేజ చెప్పాడు.

 

అయితే ఆ రోజు కుటుంబ సభ్యులను మీడియావాళ్లు అప్రోచ్ అయ్యేందుకు యత్నించటం, ప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చిన స్టేట్ మెంట్, విత్ ఫ్రూఫ్ లతోనే పత్రికల్లో వార్తలు వచ్చాయని ఓ రిపోర్టర్ చెప్పటంతో రవితేజ తడబడ్డాడు. అంత్యక్రియలకు హాజరు కాకపోవటం వ్యక్తిగత విషయమని, కానీ, మీడియాపై విమర్శలు తగవని మీడియా మాస్ రాజాను కోరింది. దీంతో తాను మీడియాని విమర్శించలేదని, సోషల్ మీడియాలో తెలుసుకోకుండా ఘోరంగా రాసిన వార్తలను మాత్రమే ఖండించానని రవితేజ చెబుతూ అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Ravi Teja  Bharath death  TollYwood News  

Other Articles