Akshay Kumar Not become the next Bigg Boss

Bollywood bigg boss host change

Salman Khan, Akshay Kumar, Salman Khan Akshay Kumar, Salman Akshay

Salman Khan opts out of Bigg Boss 11; Akshay Kumar to host the next season. But, Big Boss Officially announced that was not real.

బాలీవుడ్ బిగ్ బాస్ కోసం ఫేక్ న్యూస్?

Posted: 07/01/2017 03:10 PM IST
Bollywood bigg boss host change

బిగ్ బాస్ షో ఇప్పుడు దాదాపు అన్ని భాషల్లోకి వచ్చేస్తున్న రియాలిటీ షో. బాలీవుడ్ లో 10 సీజన్లుగా దుమ్ముదులుపుతుంటే, కన్నడలో ఇప్పటికే స్టార్ హీరో సుదీప్ తో నాలుగు సీజన్లు కూడా అయిపోయింది. అయితే తమిళ్, తెలుగులో వాటిని దించేందుకు యత్నిస్తున్నారు. తమిళ్ లో అల్రెడీ కమల్ హాసన్ తో షో ప్రారంభించగా, అంతంత మాత్రం స్పందనే రావటం గమనార్హం. దీంతో తెలుగులో ఎన్టీఆర్ తో షో ఎలా రన్ అవుతుందా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

అయితే పవర్ ఫుల్ హోస్టింగ్, ఎంచుకునే సెలబ్రిటీలు, వారి ఫెర్ ఫార్మెన్స్ లే షోని నిలబెతాయన్నది హిందీ అండ్ కన్నడలో ఇప్పటికే రుజువైంది. కాబట్టి ఆ విషయాలపై కాంసంట్రేషన్ చేస్తే మంచిదని నిర్వాహకులకు ప్రేక్షకులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే హిందీలో త్వరలో 11వ సీజన్ ప్రారంభం కాబోతుంది. దీనికి హోస్ట్ గా సల్మాన్ బదులు మరో హీరోను తీసుకున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది.

యాక్షన్ మూవీ స్పెషలిస్ట్, వరుసగా హిట్లతో దూసుకుపోతున్న అక్షయ్ కుమార్ తర్వాతి సీజన్ ను హోస్ట్ గా చేయబోతున్నాడని బాలీవుడ్ మీడియా పేర్కొంది. సల్లూ భాయ్ బోర్ కొట్టేయటం, పైగా ట్యూబ్ లైట్ ఫ్లాప్ కావటంతో తప్పించినట్లు చెప్పుకున్నారు. కానీ, అదంతా ఉత్తదేనని నిర్వాహకులు ఇప్పుడు అనౌన్స్ చేసేశారు. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bigg Boss 11  Akshay Kumar  Salman Khan  

Other Articles