Family Court Shocks to Comedian Prudhvi

Comedian ordered to pay alimony to wife

Comedian Prudhvi Raj, 30 Years Prudhvi Raj, Prudhvi Raj Wife, Prudhvi Raj Personal Life, Prudhvi Raj Divorce, Tollywood Comedian Alimony, Prudhvi Raj Vijayawada Family Court, Prudhvi Raj Wife Issue, Prudhvi Raj Family, Comedian Prudhvi Raj Sons, Pruthvi Raj Wife Srilaxmi

30 Years Prudhvi Raj the famous comedian of tollywood is suddenly into news for his personal issue with his wife,The actor is facing case against him for torturing and asking forced divorce from his wife. Vijayawada Family Court ordered Prudhvi to give 8 lakhs per month to his wife.

థర్టీ ఇయర్స్.. భార్యను భరించాల్సిందే!

Posted: 06/29/2017 03:08 PM IST
Comedian ordered to pay alimony to wife

టాలీవుడ్ లో బ్రహ్మీ క్రేజ్ కంప్లీట్ గా అధో:పాతాళానికి పడిపోతున్న క్రమంలో స్ఫూఫ్ లతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు పృథ్వీ. థర్టీ ఇయర్స్ డైలాగ్ నే ఇంటిపేరుగా మార్చుకున్న ఈ నటుడు మధ్యలో బాగా బిజీ అయినప్పటికీ ఈ మధ్య సరైన హిట్ లేక మళ్లీ డల్ అయిపోయాడు.అయితే ఒక్క డైలాగ్ సెన్సేషన్ గా మారిన ఈ నటుడి పర్సనల్ లైఫ్ మాత్రం కాస్త వివాదాస్పదంగానే ఉంది.

గతంలో భార్యను హింసించినందుకు 498ఏ కింద ఈయనపై పోలీస్ కేసు కూడా నమోదయ్యిందన్న విషయం తెలిసిందే. తాజాగా విజయవాడ ఫ్యామిలీ కోర్టు ఈ కమెడియన్ కు భార్యకు భరణం చెల్లించే విషయమై ఆదేశాలు జారీ చేసింది. విజయవాడలోని అరండల్ పేటకు చెందిన శ్రీలక్ష్మిని నటుడు శేషు అలియాస్ మూర్తి అలియాస్ బాలిరెడ్డి పృథ్వీరాజ్ 1984లో వివాహం చేసుకున్నాడు. శ్రీలక్ష్మి తండ్రి చనిపోవటంతో వారి మిఠాయి షాపును షాపును పృథ్వీయే నిర్వహించాడు. ఆపై నటనపై ఆసక్తితో చెన్నైకి వెళ్లటం, కెరీర్ టర్న్ కావటంతో హైదరాబాద్ కి భార్యతో మకాం మార్చాడు. గతేడాది ఇద్దరి మధ్య గొడవలు కాగా, పెద్దలు కలుగజేసుకున్నప్పటికీ విషయం తేలలేదు.

చివరకు భార్య అతనిపై పోలీస్ కేసు నమోదు చేసింది. మరోవైపు తనను దూరంగా ఉంచుతున్న కారణంగా జీవనోపాధికి అతని నుంచి నెలకు రూ.10 లక్షలు ఇప్పించాల్సిందిగా కోరు ఫ్యామిలీ కోర్టులో కేసు దాఖలు చేసింది. కోర్టు నోటీసులు పంపినా స్పందించకపోవటంతో పేపర్ లో ప్రకటన ద్వారా నోటీసు ఇచ్చింది. అయినా హాజరుకాకపోవటంతో బాధితురాలికి నెలకు రూ.8 లక్షలు భరణంగా చెల్లించాలని చెబుతూ నటుడు పృథ్వీకి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Comedian Pruthvi Raj  Famil Court  Alimony  

Other Articles