Twitter suspends singer Abhijeet Bhattacharya's account మహిళలంటే అలుసా..? గాయకుడిపై ట్విట్టర్ చర్యలు..

Twitter suspends singer abhijeet s twitter account over abusive tweets

abhijeet bhattacharya, abhijeet, abhijeet bhattacharya twitter suspended, abhijeet twitter suspended, abhijeet bhattacharya tweets, istandwithabhijeet, sonu nigam, shela rashid, swati chaturvedi, bollywood

Twitter today suspended singer Abhijeet Bhattacharya's account after he posted a string of ‘offensive’ tweets, especially against women.

తీరు మార్చుకోని బాలీవుడ్ సింగర్ కు షాక్..

Posted: 05/24/2017 03:02 PM IST
Twitter suspends singer abhijeet s twitter account over abusive tweets

సభ్య సమాజంలో గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తులు వారి గౌరవమర్యాదలను నిలబెట్టుకోవాలి. అప్పుడే వారికి సంఘంలో మరింత గుర్తింపు లభిస్తుంది. బాలీవుడ్ కండలవీరుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రోడ్లు ఏమైనా పేద వారి జాగీరా... వారు అక్కడ పడుకోవడమేంటి.. నేను కూడా ఒకప్పుడు పేదవాణ్ణే కానీ రోడ్డపై మాత్రం ఎప్పుడు పడుకోలేదంటూ పేదవారిని చులకన చేసే విధంగా వ్యాఖ్యలు చేసిన అభిజీత్ భట్టాచార్య తన వివాదాస్పద, చులకన, వ్యంగకర వ్యాఖ్యలపై తన తీరును మార్చకోకపోవడంతో ఆయనకు షాక్ తగిలింది.

మహిళలను భారతీయ సంస్కృతీ, సంప్రదాయల ప్రకారం దేవతలుగా కోలుస్తారు. యత్ర నార్యంతు పూజ్యంతే రమ్యతే తత్ర దేవతాం అని భావించే సంస్కృతి మనది. పరస్త్రీలను లక్ష్మీదేవి అని భావించడం మన ధర్మం. అలాంటి దర్మభూమిలో, కర్మభూమిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని కూడా మహిళలంటే చులకనభావం..ప్రకటించే బాలివుడ్ గాయకుడికి గొంతను ఎట్టకేలకు నొక్కేసింది. మహిళలను అవమానపర్చేలా.. కించపర్చేలా ట్విట్లను ఎప్పటికప్పుడు పెడుతూ అభ్యంతరకర రీతిలో వ్యాక్యలు చేస్తున్న అభిజీత్ భట్టాచార్యకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఎట్టకేలకు షాక్ ఇచ్చింది.

అభ్యతరకర వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ట్విట్టర్ అకౌంట్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మహిళల్ని కించపరిచేలా ట్వీట్లు చేయటం.. అభ్యంతరకర రీతిలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని.. అనుచితమైన.. అవమానకరమైన భాషను వాడుతున్నందుకే ఆయన ఖాతాను డిలీట్ చేసేసినట్లుగా ఆయన పేజీలో ట్విట్టర్ సమాచారం ఇవ్వటం సంచలనంగా మారింది. ఇటీవల జేఎన్యూ విద్యార్థిని.. హక్కుల కార్యకర్త షెహ్లా రషీద్ పట్ల ఆయన పలు అభ్యంతరకర ట్వీట్లు చేశారు. ఆమె రెండు గంటల కోసం డబ్బులు తీసుకొని.. తన క్లయింట్కు సంతృప్తి ఇవ్వలేదన్న రూమర్ ఉందంటూ వెకిలి కామెంట్లు చేశారు.

ఇక మహిళా జర్నలిస్ట్ స్వాతి చతుర్వేదిపై రెచ్చగొట్టేలా.. విద్వేషపూరిత ట్వీట్లు చేయటంపై సోషల్ మీడియాలో ఆయనపై ఆగ్రహం వ్యక్తమైంది. ఈ అంశంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన ఇప్పటికైన మహిళలు మహరాణులు అని తెలుసుకోకుండా, తన తీరును ఏమాత్రం మార్చుకోకుండా అవే అభ్యంతరకర వ్యాఖ్యలు చేయటంతో ఆయన పేజీని రద్దు చేస్తూ ట్విట్టర్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు పలువురు మహిళల మీదా ఆయన ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : abhijeet bhattacharya  twitter  account suspended  bollywood  

Other Articles