Kollywood Stars Petition against Arrest warrant

Kollywood stars petition on non bailable warrant

Kollywood Stars, Kollywood Actors Arrest Warrant, Kollywood Stars Non Bailable Warrant, Kollywood Stars Defamation Case, Kollywood Actors Abusing Journalist Case, Kollywood Stars Case, Suriya Satyaraj Sharat Kumar

Non-Bailable Warrants Against 7 Actors Including Surya And Sathyaraj. Actors again petition for cancel that petition.

నాన్ బెయిలబుల్ వారెంట్ పై కోలీవుడ్ స్టార్ల పిటిషన్

Posted: 05/25/2017 07:55 AM IST
Kollywood stars petition on non bailable warrant

కోలీవుడ్ టాప్ హీరోలకు తమిళనాడు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. 2009లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు సూర్య, సత్యరాజ్, శరత్ కుమార్ లు జర్నలిస్టులను దూషించారు. దీనిపై ఊటికి చెందిన ఓ జర్నలిస్ట్ కోర్టులో కేసు దాఖలు చేశాడు.

విచారణలో భాగంగా కోర్టుకు హాజరుకావాల్సిన వీరంతా నిర్లక్ష్యం వహించారు. వారే కాదు వారి తరపు న్యాయవాది కూడా హాజరుకాలేదు. దీంతో నీలగిరి కోర్టు మొత్తం 8 మంది కోలీవుడ్ నటులకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. దీంతో వారంతా తిరిగి నీలగిరి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమపై జారీచేసిన నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ ను రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు.

విశ్వనాథ్ అనే న్యాయవాది నటుల తరపున ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. తమకు వాదన వినిపించేందుకు తగిన సమయం ఇవ్వాలంటూ విజ్నప్తి చేశాడు. వ్యభిచారంలో పలువురు కోలీవుడ్ స్టార్ల పేర్లను ఓ తమిళ పత్రిక ప్రచురించటం ఆగ్రహాం చెందిన సదరు నటీనటులు జర్నలిస్ట్ లపై దుర్భాషలాడటం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kollywood Stars  Journalist Case  Arrest Warrant  

Other Articles

Today on Telugu Wishesh