Baahubali 2 Hindi-Dubbed Version Records

Baahubali 2 hindi version inches towards r 400 crore

Baahubali 2, Baahubali 2 Dangal Collections, Baahubali 2 Bollywood Collections, Baahubali 2 Hindi Collections, Baahubali 2 400 Crores, Baahubali 2 Hindi 400 Crores, Baahubali 2 Karan Johar Profits, Baahubali 2, Dangal PK Baahubali 2

Baahubali 2 May Breaks Dangal's Indian Collection Record After 10 Days. Racing towards Rs 400 crore.

బాలీవుడ్ లో బాహుబలి-2 ఇంకా పూర్తవలేదు

Posted: 05/09/2017 12:27 PM IST
Baahubali 2 hindi version inches towards r 400 crore

బాహుబలి 2.. వెయ్యి కోట్ల ప్రభంజంను అల్రెడీ క్రాస్ చేసి దూసుకుపోతున్న ఈ చిత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఎవరూ ఊహించని రీతిలో 30 రికార్డులు బద్ధలు కొట్టిన ఈ చిత్రం మరో అరుదైన ఫీట్ కు రెడీ అయిపోతుంది. ఇప్పటికే హయ్యెస్ట్ గ్రాసర్ గా ఉన్న ఈ చిత్రం బాలీవుడ్ లో అత్యధిక వసూలు చేసిన చిత్రం లిస్ట్ లో చోటు సంపాదించేందుకు ఎంతో టైం పట్టేలా లేదు.

హిందీ వర్షన్ బాహుబలి 2 ఇప్పటికే 300 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించేసి 400 దిశగా పరుగులు తీస్తోంది. దీనికన్నా కలెక్షన్లలో ముందున్న చిత్రాలు పీకే(337 కోట్లు), దంగల్ (371) మాత్రమే. ఇవి రెండూ కూడా స్ట్రెయిట్ బాలీవుడ్ చిత్రాలు కాగా, బాహుబలి కేవలం డబ్బింగ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇండియాలో బాలీవుడ్ టాప్ లిస్ట్ లో నిలిచేందుకు కూడా బాహుబలి 2 కి మరో వారం పట్టే ఛాన్స్ ఉంది. ఆ లెక్కన సుమారు 50-70 కోట్లకు అమ్ముడు పోయిన రైట్స్ తో ఊహకందని భారీ లాభాలనే కరణ్ జోహర్ కి అందించబోతుందన్న మాట.

ఇప్పటికే మళయాళంలో 30, తమిళ్ లో 80, తెలుగులో 140 ఇలా దూసుకుపోతున్న ఈ చిత్ర కలెక్షన్లు.. లాంగ్ రన్ లో బాలీవుడ్ లో 500 కోట్లు గనుక సాధిస్తే గనక ఇండియన్ హిస్టరీ ఓ డబ్బింగ్ చిత్రం సృష్టించిన ప్రభంజనాన్ని అధిగమించేందుకు ఏనే్ళ్లు పడుతుందో మాత్రం చెప్పటం కష్టం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  Hindi Version Collections  Dangal and PK  

Other Articles