వీడియో: సమంత కర్ర తిప్పుడూ చించేసిందిగా... | Samantha practicing karrasamu video viral.

Samnatha busy in learning silambam

Samantha in GYM Video, Samantha Gym Video, Samnatha gym, Samantha Karrasaamu, Samantha Silambam, Silambam Samantha, Samantha New Addiction, Samantha Practicing Video, Samantha Karrasamu

Actress Samantha busy with Silambam aka Karrasaamu in GYM.

కర్రసాములో సమంత బిజీ బిజీ

Posted: 04/20/2017 01:14 PM IST
Samnatha busy in learning silambam

సౌత్ బ్యూటీ సమంత ఒళ్లు తగ్గించేందుకు మళ్లీ కసరత్తులు చేస్తోంది. చెర్రీ-సుక్కూ షూటింగ్ లో పాల్గొని తిరిగి హైదరాబాద్ వచ్చిన శామ్ జిమ్ లో తెగ బిజీగా ఉంది. అయితే ఈ క్రమంలో ఓ ప్రాచీన క్రీడను సాధన చేయటం చర్చనీయాంశంగా మారింది. సిలంబన్ అని పిలుచుకునే ఈ క్రీడ అదేనండీ మన భాషలో కర్రసామును సాధన చేస్తోంది.

అవలీలగా కర్రను తిప్పుతూ అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంది. ఆ వీడియో ఇప్పుడు నెట్ లో తెగ వైరల్ అవుతోంది. అన్నట్లు ఈ కొత్త అడిక్షన్ దేని కోసం అంటారా? అక్కడే క్లారిటీ లేకుండా పోయింది. ప్రస్తుతం రాంచరణ్ సినిమాతోపాటు విజయ్ సినిమా లో నటించబోతుంది. ఈ రెండింటిలో దేని కోసం చేస్తుందో ఖచ్ఛితంగా చెప్పలేం కానీ తనకు అలవాటు లేని పనిని శ్రద్ధగా నేర్చుకుంటున్న సమంతను చూసి అభినందించకుండా ఉండలేకపోతున్నాం.

 

ఆ సంగతి పక్కన పెడితే తెలుగులో నాగ్ రాజుగారి గది-2 తోపాటు విజయ్ సేతుపతి చిత్రం, విశాల్ తో మరో సినిమాలో సమంత మెయిన్ లీడ్ పోషిస్తోంది. అన్నట్లు దేశంలోనే బిగ్ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న సంఘమిత్ర కోసం శృతీహాసన్ కూడా కళరి(కత్తిసాము)తో కష్టపడటం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Samantha  Karrasamu Video  

Other Articles