మెగా గిఫ్ట్... నాని బాకీ తీరిపోయిందిగా.. | Chiranjeevi buys cycle for Nani.

Mega star chiru gifted cycle to hero nani

Hero Nani, Chiranjeevi, Meelo Evaru Koteeswarudu, Meelo Evaru Koteeswarudu Nani, Nani Chiranjeevi, Chiru Gift Cycle, Nani Chiru Cycle, Chiru MEK

Hero Nani got a cycle from Megastar Chiranjeevi as a gift.

నాని సైకిల్ బాకీ చిరు తీర్చేశాడుగా...

Posted: 04/15/2017 09:22 AM IST
Mega star chiru gifted cycle to hero nani

మెగాస్టార్‌ చిరంజీవి తన ప్రామిస్ నిలబెట్టుకున్నాడు. యంగ్‌ హీరో నాని కోరికను తీర్చేశాడు. ఓ మంచి సైకిల్‌ కొని అతనికి గిఫ్ట్ గా పంపించాడు. మొన్న ప్రసారం అయిన మీలో ఎవరు కోటీశ్వరుడుకు షోకి హాజరైన హీరో నాని మాస్టర్‌ సినిమా సందర్భంగా కోల్పోయిన సైకిల్‌ గురించి చిరుకు చెప్పాడు. అంతేకాదు మీరు నాకు సైకిల్ బాకీ అంటూ చిరునే కోరాడు.

మరి నాని ఈ చిరు కోరికను మెగాస్టార్ తీర్చకుండా ఉంటాడా? షోలో గెలుచుకున్న దానిలో కొంత సొమ్ముతో ఆ సైకిల్‌ కొనుక్కుంటానంటూ నాని చెబితే అందుకు నో చెప్పిన చిరంజీవి తన సినిమాకు వచ్చినందుకు సైకిల్‌ పోయింది కాబట్టి, తానే కొత్త సైకిల్‌ కొనిపెడతానని హామీ ఇచ్చాడు. అన్న మాట ప్రకారం ఓ మాంచి సైకిల్ కొని నానికి ప్రజెంట్ చేశాడు. మరి ఈ సంతోషాన్ని నాని అభిమానులతో పంచుకోకుండా ఉంటాడా.. వెంటనే ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు. చిరంజీవి గారు పంపిన సూపర్‌ కూల్‌ సైకిల్‌ అంటూ ఫోటోలను షేర్‌ చేశారు.

 

మొత్తానికి అభిమానుల కోరికలనే కాదు, ఇలా సెలబ్రిటీల కోరికలను తీరుస్తూ చిరంజీవి అందరివాడిగా అలరిస్తున్నాడు.  ఇక 151 వ చిత్రం ఉయ్యలవాడ నరసింహరెడ్డి చిత్రం కోసం చిరు కసరత్తులు చేస్తుండగా, నాని నిన్ను కోరి సినిమా షూటింగ్ లో తెగ బిజీగా ఉన్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Chiranjeevi  Cycle  Meelo Evaru Koteeswarudu  

Other Articles