మూడుముళ్లు వేయని దర్శకుడికి మూడేళ్ల జైలు.. director sentenced for 3 years in actress abduction attempt case

Tollywood director suresh sentenced for 3 years in actress abduction attempt case

actress abution case, director sentenced, tolllywood directot abdution case, director suresh krishna, actress director, director actress, suresh krishna, director, actress, suresh krishna, additional sessions court, abduction case, tollywood news, latest tollywood news

Additional sessions court sentenced tollywood director suresh along with his brother for 3 years in actress abduction attempt case.

నటి కిడ్నీప్ కేసులో దర్శకుడికి మూడేళ్ల జైలు..

Posted: 04/08/2017 11:52 AM IST
Tollywood director suresh sentenced for 3 years in actress abduction attempt case

ప్రేయసిని అపహరించే ప్రయత్నిం చేసిన దర్శకుడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్ప..  సినీ నటిని లొబర్చుకుని అమెతో సహజీవంన చేసిన, ఏకాంతంగా వున్న వీడియోలను తీసి.. అపై పెళ్లికి నిరాకరించిన కేసులో దర్శకుడు సురేష్ కృష్ణ అలియాస్ సురేష్ కు న్యాయస్థానం మూడేళ్ల శిక్షను విధించింది. నటి పెళ్లికి ఒత్తిడి చేయడంతో అమెను అపహరించాలని ప్రయత్నం చేసిన కేసులో దర్శకుడు సురేష్ తో పాటు అతడి  సోదరుడికి న్యాయస్థానం శిక్ష విధించింది.

అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ టీవీ ప్రసాద్ చెప్పిన వివరాల ప్రకారం.. కడపకు చెందిన ఐ.సురేశ్ అలియాస్ సురేశ్ కృష్ణ కూకట్‌పల్లిలోని భాగ్యనగర్ కాలనీలో ఉంటున్నాడు. సినిమాలకు దర్శకత్వం వహించే ఆయన 2012లో ఓ సినిమాకు పనిచేస్తున్నప్పుడు సినీ నటి (25)ని ప్రేమిస్తున్నట్టు నమ్మించి లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేశాడు. అందటితో అగకుండా అమెతో ఏకాంతంగా వున్నప్పుడు వీడియోలను తీసి.. వాటి ద్వారా అమెను బ్లాక్ మెయిల్ చేసి పెళ్లికి నిరాకరించాడు.

ఈ క్రమంలో నటి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో సెప్టెంబరు 29, 2012న సోదరుడు సతీశ్‌, స్నేహితుడు బుజ్జితో కలిసి సినీ నటిని కిడ్నాప్ చేసేందుకు కూడా ప్రయత్నించాడు. సకాలంలో స్థానికులు స్పందించి అడ్డుకోవడంతో ఆమెను వదిలిపెట్టి పరారయ్యాడు. ఈ కేసును విచారించిన 8వ అదనపు సెషన్స్ కోర్టు కిడ్నాప్ నేరం రుజువు కావడంతో దర్శకుడు సురేశ్, అతడి సోదరుడు సతీశ్‌లకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికీ రూ.5వేల చొప్పున జరిమానా కూడా విధించింది. అయితే అమెను ప్రేమపేరుతో మోసం చేసిన కేసుకు సంబంధించిన వివరాలు మాత్రం తెలియరాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : director  actress  suresh krishna  additional sessions court  abduction case  tollywood  

Other Articles