గురు ట్రైలర్ రివ్యూ.. కోపిష్టి కోచ్ గా దంచేసిన వెంకీ | Guru Movie Trailer Review.

Venky guru movie trailer released

Venkatesh Guru Movie, Guru Movie Trailer, Guru Movie Official Trailer, Guru Trailer Review, Pawan Song in Guru Movie, Guru Movie 2017, Ritika Singh Pawan kalyan, Venky Guru Trailer, Guru Trailer Review, Guru Trailer

Venkatesh Guru Movie Official Trailer Released.

వెంకీ గురు అఫీషియల్ ట్రైలర్ రిలీజ్

Posted: 03/21/2017 08:35 AM IST
Venky guru movie trailer released

సాలా కడ్డూస్ లాంటి క్రిటిక్స్ మూవీకి ఒప్పుకోవటం ఒక గట్స్ అయితే అందుకోసం వెంకీ ఎలా మారబోతున్నాడా? అన్న ఎగ్జయిట్ మెంట్ ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే బాక్సింగ్ కోచ్ గా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్కులో అదరగొట్టేసిన వెంకీ టీజర్ లో తానెంటో ఫ్రూవ్ చేసుకున్నాడు కూడా. 50 ఏళ్ల వయసులో ఫిట్ బాడీతో అదరగొట్టాడు.

ఇక ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసి ఆ అంచనాలను మరింత పెంచేశాడు. ఓ ఆరోగెంట్ అయిన బాక్సింగ్ కోచ్ కి ఓ స్లమ్ నుండి వచ్చిన ఒకమ్మాయికి మధ్య జరిగే కథే ఇది. ఎలాగైనా బాక్సింగ్ ఛాంపియన్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న వెంకీకి ఆ అమ్మాయి ప్రవర్తన అస్సలు నచ్చదు. కొడతాడు, తిడతాడు అయినా మారదు. మరి ఆ టైంలో ఏం చేశాడు.. ఆ అమ్మాయి ఎలా కోచ్ కి కనెక్ట్ అయిపోతుందనేది చూపించాడు. అల్రెడీ టీజర్ లో నాజర్ ను తిట్టే వెంకీ ఇప్పుడు 'ఊర కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని దృష్టంతా ఎప్పుడూ పెంట మీదనే ఉంటుంది' అంటూ మరో డైలాగ్ పేల్చాడు. మాతృక వర్షన్ కు పెద్దగా మార్పులు చేసినట్లు అనిపించకనప్పటికీ పవన్ కటౌట్ ముందు చిందులేసే రితిక, టార్చర్ పెట్టే కోచ్ గా వెంకీ, చివర్లో చీర కట్టుకుని వెంకీకి రితిక దర్శనమివ్వటం ఇలా రొమాంటిక్ యాంగిల్ తో ట్రైలర్ ను ముగించేశాడు.

 

మొత్తానికి బాడీ, బాడీ లాంగ్వేజ్ తో వెంకీ, యాక్టింగ్ తో రితికా సింగ్ కూడా ఆకట్టుకున్నట్లు అర్థమౌతుంది. ఓ రీమేక్ చిత్రం అయినప్పటికీ ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన వెంకీ ఈ సమ్మర్ లో సందడి చేసేందుకు సిద్ధమైపోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Guru Movie  Official Trailer  Actor Venkatesh  

Other Articles