రాజశేఖర్ కొత్త సినిమా కష్టాలు.. నిర్మాత ఎవరో తెలిస్తే షాకవుతారు | Garuda Vega Producer changed.

New producer for rajasekhar praveen sattaru movie

PSV Garuda Vega Movie, Rajasekhar New Movie, Rajasekhar 2017, Actor Rajasekhar, Rajasekhar Praveen Sattaru Movie, Jeevitha Rajasekhar Producer, PSV Garuda Vega Producer, PSV Garuda Vega Director, Garuda Vega Financial Troubles, Garuda Vega Hero

Dr. Rajasekhar’s upcoming film PSV Garuda Vega 126.18M. The film’s budget has already exceeded Rs. 6.5 crore and fair amount of filming is yet to be done. Major part of the film is being shot in foreign locations, the reason for budget to shot up way above expectations. Rajasekhar is pretty confident that this thriller would do well and hence called in his wife Jeevitha Rajasekhar to take over the project and handle the finances.

రాజశేఖర్ కొత్త సినిమాకు నిర్మాత మారాడా?

Posted: 02/22/2017 12:51 PM IST
New producer for rajasekhar praveen sattaru movie

యాంగ్రీ మాన్ రాజశేఖర్ కి లాస్ట్ సినిమా ఎప్పుడు హిట్ పడిందో కూడా సరిగ్గా ఎవరికీ గుర్తులేదు. బహుశా ఎవడైతే నాకేంటి లాంటి పొలిటికల్ జోనర్ సినిమా తర్వాత ఓ అరడజను ఫ్లాపులు ఆయన ఖాతాలో పడే ఉంటాయి. అయితే చందమామ కథలు, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తో సినిమా ప్రకటించగానే అందరిలో ఆసక్తి రేగింది.

పీఎస్ వీ గరుడ వేగ 126.18 అనే ఓ విచిత్రమైన టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ కాప్ స్టోరీ ఫస్ట్ లుక్ ఆ మధ్య సెన్సేషన్ గా మారింది. మళ్లీ పాత రోజుల్లో రాజశేఖర్ ను గుర్తు చేసిదిగా ఉన్న ఆ పోస్టర్ లో వైవిధ్యం సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. రాజశేఖర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగానే కాదు, ఎక్కువ శాతం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటోంది కూడా.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఇప్పుడు కొత్త చిక్కు ఎదురయ్యింది. ఆర్థిక సమస్యలతో ఈ చిత్ర నిర్మాత డ్రాప్ అయినట్లు సమాచారం. అల్రెడీ బడ్జెట్ ఇప్పటికే సుమారు 7 కోట్ల దాకా అవగా, తన వల్ల కాదని చేతులెత్తేశాడంట. దీంతో ఆ బాధ్యతలను తన వైఫ్ జీవితను టేకోవర్ చేసుకోవాలని రాజశేఖర్ సూచించినట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న కథపై కాన్ఫిడెన్స్ తోనే ఈ సీనియర్ హీరో ధైర్యం చేసినట్లు సమాచారం. అయితే డైరక్షన్ విభాగంలో జీవిత మాత్రం జోక్యం చేసుకోకపోతే మంచిదని పలువురు సూచిస్తున్నారు. కమ్ బ్యాక్ లో మరి ఈ హీరో హిట్ కొడతాడేమో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PSV Garuda Vega  Rajasekhar  Producer  Jeevitha Rajasekhar  

Other Articles