బాహుబలి-2 లో షారూఖ్ రోల్.. అతని వల్లేనా? | Shah Rukh Khan to be part of Baahubali The Conclusion.

Shah rukh khan s cameo in baahubali 2

Baahubali 2, Baahubali The Conclusion, SRK Baahubali 2, Baahubali The Conclusion Shah Rukh Khan, Shah Rukh Khan Baahubali-2, Shah Rukh Khan Cameo, SRK Rajamouli, Shah Rukh Khan Rajamouli, Shah Rukh Khan Cameo

Everyone's been waiting for Baahubali 2 to get the answers to the queries they have been waiting for! But before that happens, we have an interesting update on Baahubali 2. We hear that Bollywood superstar Shah Rukh Khan might have an important cameo in this mighty project.

బాహుబలి-2 లో బాద్ షా రూమరేనా?

Posted: 02/14/2017 09:18 AM IST
Shah rukh khan s cameo in baahubali 2

బాహుబలి-2 షూటింగ్ పూర్తయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇంతలో ఓ వార్త ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదుగానీ తెగ చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ బాహుబలి ది కంక్లూజన్ లో గెస్ట్ రోల్ చేయబోతున్నాడన్న వార్త హల్ చల్ చేస్తోంది. దీనికి కారణం రాజమౌళి, షారూఖ్ ను కలిశాడన్న న్యూస్ బయటికి రావటమే.

దర్శకుడు రాజమౌళి ఇప్పటికే షారూఖ్‌తో చర్చలు జరిపినట్టు సమాచారం. చిత్రంలోని ప్రముఖ పాత్రను షారూఖ్‌తో చేయించాలని రాజమౌళి నిర్ణయించారని, కరణ్ ఇన్వాల్ కావటంతోనే ఇది జరిగిందని, ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారని టాలీవుడ్ భోగట్టా. అయితే ఈ విషయంలో అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు.

చలనచిత్ర రికార్డులు బ్రేక్ చేసిన బాహుబలికి సీక్వెల్‌గా వస్తున్న బాహుబలి-2 కోసం ఇప్పటికే దేశమంతా ఎదురుచూస్తోంది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్నకు ఈ చిత్రంలో సమాధానం దొరకబోతోంది. కాగా ఈ సినిమాలో షారూఖ్ ఉంటే సినిమాకు మరింత ప్లస్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే అంతా పూర్తి కావటంతో ఏ రోల్ లో ఇరికిస్తారన్నదే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతానికైతే దీన్ని ఓ రూమర్ గానే భావిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  SS Rajamouli  Baahubali-2  Cameo  

Other Articles