లోకల్ లో నాని లేకపోయినా ఫర్వాలేదా? | Nani skip Nenu Local Promotions

Nenu local promotions without nani

Nani Nenu Local Interview, Nani Nenu Local America Preview, Nani Nenu Local in America, Non Local Nani, Nani New Movie America, Nani New Movie Shooting, Nani America, Nani Dil Raju, Nani Interview

Nani's "Nenu Local" is releasing this Friday but Nani promoted the movie much like the way he did for his other films. Although he will be watching the movie with fans in USA on the first day, he won't be available for promotions here in India. Nani will be shooting for his new film in the direction of newcomer Siva Kumar in USA for nearly 40 days. He will return to India in March. So, Dil Raju may have to plan the post-release promotions without Nani.

నానిపై విమర్శలకు ఓ క్లారిటీ

Posted: 02/02/2017 01:04 PM IST
Nenu local promotions without nani

ఓవైపు తన సినిమా రిలీజ్ దగ్గర పడ్డా కూడా ప్రమోషన్ల గురించి పట్టించుకోకపోవటంతో నాని ఆటిట్యూడ్ పై పలువురు మండిపడుతున్నారు. ఇక్కడ కాకుండా అమెరికాలో అభిమానులతో సినిమా ఫస్ట్ డే చూసేందుకు సిద్ధమైపోతుండటంతో కొంపదీసి మనోడు స్టార్ హీరోలా ఫీలయిపోతున్నాడా? అని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అల్రెడీ ఇదే యేడాది దిల్ రాజు తో మరో చిత్రం తీయబోతున్నాడు. ఇలాంటి సమయంలో నాని ప్రమోషన్ లు ఎగ్గొటి వెళ్లాడా? అయినా ఆ స్టార్ నిర్మాత ఊరుకుంటున్నాడా? అని అంతా అనుకున్నారు. అయితే ఈ విమర్శలపై ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చేసింది.

నిజానికి నాని యూఎస్ వెళ్లింది కేవలం నేనులోకల్ సందడి చేసేందుకే కాదు, తన కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొనేందుకు కూడా. సాధారణంగా తన చిత్రం రిలీజ్ కావటమే ఆలస్యం కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొనటం నానికి అలవాటు. అందుకే ఇప్పటికే ముహుర్తం లాంఛ్ అయన కొత్త సినిమా కోసం అక్కడికి వెళ్లాడంట. కొత్త కుర్రాడు శివకుమార్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించబోయే సినిమా కోసం అక్కడే 40 రోజులపాటు షూటింగ్ లో నాని పాల్గొనబోతున్నాడు.

ఆ కమిట్ మెంట్ గురించి వివరించాకే దిల్ రాజు నానితో ముందుగానే మీడియాకు కామన్ ఇంటర్వ్యూ ఇప్పించి, కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు పర్మిషన్ ఇచ్చేశాడంట. నేను లోకల్ రిలీజ్ అయ్యాక టీవీల్లో మొత్తం హీరోయిన్ కీర్తి సురేష్ తో తానే స్వయంగా ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నాడు దిల్ రాజు. ఇక నాని కొత్త సినిమా విషయానికొస్తే నివేదా థామస్ ఈ చిత్రంలో నానికి జోడీగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Nenu Local  Promotions  

Other Articles