ఆ సినిమాలో కరీనా, కత్రినా.. అంతకన్నా చెండాలం మరోకటి లేదన్న దర్శకుడు | imagine Katrina-Kareena playing Geeta-Babita in Dangal.

Subhash ghai on casting important

Subhash Ghai, Katrina-Kareena, Katrina-Kareena Dangal, Katrina Kaif Kareena kapoor Dangal, Subhash Ghai on Star Casting, Subhash Ghai Suggestions, Subhash Ghai 2017

Legendary Filmmaker Subhash Ghai In his career he has never given priority to a star, but has chosen actors who suited the role.“My priority has never been a star. I give importance to the story. Casting is a crucial factor. Imagine Katrina (Kaif) and Kareena (Kapoor Khan) playing the characters of Geeta (Phogat) and Babita (Kumari) in Dangal. Or even, Anupam Kher essaying the role of Mahavir Singh Phogat,” he says, adding, “I rope in actors who I feel would do justice to the role. I approach a star only when he or she is required. And for this, I have seen both successes and failures.”

40 ఏళ్లలో ఏనాడూ కాంప్రమైజ్ కాలేదంట!

Posted: 02/02/2017 11:33 AM IST
Subhash ghai on casting important

బాలీవుడ్ లో అమీర్ ఖాన్ దంగల్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. నోట్ల రద్దు తర్వాత కూడా 350 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిందంటే అందులో దర్శకుడి ప్రతిభ, అమీర్ కష్టం రెండూ దాగున్నాయి. అయితే గుర్రం చేసే పని గుర్రమే చేయాలని గాడిదతో చేయించకూడదని అంటున్నాడు స్టార్ డైరక్టర్ సుభాష్ ఘాయ్. స్టార్లనే తీసుకోవాలన్న రిక్వర్ మెంట్ తో పని చేస్తే దంగల్ లాంటి చిత్రాలు మన ముందుకు వచ్చేశా? అంటూ ప్రశ్నిస్తున్నాడు. నాలుగు దశాబ్దాలుగా దాదాపు 40 ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించిన సీనియర్ దర్శకుడు ఏనాడూ తన చిత్ర కాస్టింగ్ విషయంలో కాంప్రమైజ్ కాలేదంట.

పాత్ర ను చూసి పాత్రధారిని ఎంచుకుంటానే తప్ప, కేవలం స్టార్ అన్న ఉద్దేశ్యంతో వాళ్లకు ఛాన్స్ ఇస్తే అంత కన్నా తప్పు మరోకటి ఉండదని అంటున్నాడు. ఉదాహరణకు దంగల్ లో కత్రినా కైఫ్, కరీనా కపూర్ లు గీతా, భవిత పాత్రలు పోషిస్తే ఎలా ఉండేది. అమీర్ స్థానంలో అనుపమ్ ఖేర్ ను తీసుకుని ఉంటే ఫలితం ఎలా ఉండేది. అంటే పాత్రకు ఎవరైతే న్యాయం చేస్తారనిపిస్తారో వాళ్లను మాత్రమే తీసుకోవాలి. అంతేగానీ, కేవలం స్టార్లు, వారి స్టార్ డమ్ మూలంగా కలెక్షన్లు వస్తాయన్న ఉద్దేశ్యంతో కథను నాశనం చేసుకోకండి అంటూ తోటి దర్శకులకు సలహా ఇచ్చాడు. గతంలో తాను అలాంటి పొరపాటే చేసి దెబ్బతిన్నానని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో అత్యవసరం అనుకుంటేనే వాళ్లను పాత్రలకు ఎంపిక చేయాలంటూ తెలిపాడీ లెజెండరీ ఫిల్మ్ మేకర్.

శతృఘ్నసిన్హాతో కాళిచరణ్ లాంటి బ్లాక్ బస్టర్ తో డైరక్టర్ గా డెబ్యూ చేసిన సుభాష్ ఘాయ్ కెరీర్ లో చెప్పుకోదగిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. కర్జ్, రాం లఖన్, హీరో, మేరీ జంగ్, తాళ్, పర్ దేశ్ చిత్రాలకు ఆయనే దర్శకుడు. ఇక బ్లాక్ బస్టర్ రాంలఖన్ రీమేక్ పై స్పందిస్తూ ఆ చిత్ర హక్కులను తాను కరణ్ జోహర్ కు అమ్మేశానని, తన ఇష్టం వచ్చిన దర్శకుడితో తీసుకునే హక్కు కరణ్ కు ఉందంటూ వ్యాఖ్యానించాడు. రోహిత్ శెట్టి దర్శకుడిగా రాంలఖన్ రీమేక్ తెరకెక్కించేందుకు కరణ్ జోహర్ యత్నిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subhash Ghai  Star Casting  2017  Movies  

Other Articles