ఇంట్రస్టింగ్: తండ్రి తిట్లు.. కొడుకేమో ట్వీట్లు... | Hrithik Roshan Posts Wonderful Message For Shah Rukh Khan.

Kaabil makers upset with raees release

Hrithik Roshan, Shah Rukh Khan, Kaabil-Raees clash, Hrithik Posts Wonderful Message, Shah Rukh Khan REACTS to Hrithik, Kaabil-Raees reviews

On REGRETS the Kaabil-Raees clash Hrithik Roshan Posts Wonderful Message For Shah Rukh Khan and Shah Rukh Khan REACTS to Hrithik Roshan's tweet.

షారూఖ్ హృతిక్ ను నిజంగానే మోసం చేశాడా?

Posted: 01/25/2017 04:44 PM IST
Kaabil makers upset with raees release

బాలీవుడ్ లో మరో బిగ్ క్లాష్ తప్పలేదు. షారుఖ్‌ఖాన్‌ హీరోగా తెరకెక్కిన 'రాయిస్‌', హృతిక్‌ రోషన్‌ కాబిల్ సినిమాలు ఒకే రోజు విడులై పోటీకి దిగాయి. అయితే దీనిపై తండ్రి, నిర్మాత రాకేష్‌ రోషన్‌ బాహాటంగా అసంతృప్తిని వెళ్లగక్కాడు. 'కాబిల్‌' సినిమాను ఈ రోజున (జనవరి 25న) విడుదల చేస్తామని ఎంతో ముందుగానే రాకేశ్‌ ప్రకటించారు. ఆ తర్వాత పలుసార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన షారుఖ్‌ 'రాయిస్‌' కూడా బుధవారమే ప్రేక్షకుల ముందుకు రావాలని నిశ్చయించింది.

ఎవరో ఒకరు వెనక్కి తగ్గకపోతారా అని భావించిన వారికి చుక్కే ఎదురైంది. అయితే ఈ క్లాష్‌ నివారించేందుకు థియేటర్లను 50:50శాతం పంచుకోవాలని మొదట భావించారు. కానీ, చివరి నిమిషంలో రాకేష్‌ రోషన్‌కు షాక్‌ ఇస్తూ 'రాయిస్‌'కు అనుకూలంగా 60:40 శాతం థియేటర్లను పంచారు. దీంతో బిత్తరపోయిన రాకేష్‌ తన సినిమాను షారుఖ్‌ మోసం చేశారని వాపోయాడు. ఇలా పంపకాలు చేయడం వల్ల తనకు నేరుగా 150 కోట్ల నష్టం వస్తుందని, ఒకేసారి రెండు సినిమాలు చూసేంత డబ్బు ప్రజల వద్ద ఉండదని, కాబట్టి థియేటర్ల పంపకాల్లో జరిగిన అన్యాయం వల్ల తన సినిమా కలెక్షన్లు తగ్గిపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు కాబిల్ ను రెండుసార్లు చూశానన్న రాకేష్, రాయిస్ ను ఎట్టిపరిస్థితుల్లో చూడబోనని చెప్పాడు.

ఇదిలా ఉండగా ఓ ఇంటర్వ్యూలో షారూఖ్ వైఖరిని హృతిక్ పరోక్షంగా తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈరోజు షారూఖ్, హృతిక్ లు మాత్రం ఒకరినోకరు విషెస్ చెప్పుకోవటం ఇక్కడ విశేషం. ముందుగా హృతిక్ షారూఖ్ ను మెంటర్(గురువు) గా అభివర్ణిస్తూ రాయిస్ తో ఆకట్టుకుంటాడని ఆశిస్తున్నానని చెప్పి, ఆపై కాబిల్ తో శిష్యుడిగా నీ పేరు నిలబెడతానంటూ తెలిపాడు. ఇక షారూఖ్ ఏమో రెండు రిలీజ్ లు పెద్ద సమస్యేమీ కాదని చెబుతూ చిత్ర యూనిట్ ప్రత్యేక అభినందనలు తెలిపాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kaabil  Raees  Releases  Hrithik Roshan  Shah Rukh Khan  

Other Articles