www.virus.com తో బర్నింగ్ స్టార్ ఏం తగలపెడతాడో? | Virus movie motion poster out.

Sampoornesh babu virus motion poster released

Sampoornesh Babu, Burning Star, Virus telugu movie, www.virus.com movie, Sampoornesh Virus movie, Virus movie motion poster, Sampoo Virus, Sampoo Virus movie look

Sampoornesh Babu's Movie "Virus" Motion Poster Out. Burning star shines in three different roles.

వైరస్ కంటే వేగంగా దూసుకొస్తున్న సంపూ

Posted: 01/21/2017 01:35 PM IST
Sampoornesh babu virus motion poster released

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు చాలా గ్యాప్ తో మళ్లీ దూసుకోస్తున్నాడు. హృదయకాలేయం సినిమాతో వన్ మూవీ వండర్ గా మారిపోయిన ఈ బర్నింగ్ స్టార్ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో మరోసారి డార్క్ కామెడీతోనే అలరించేందుకు సిద్ధమైపోయి వైరస్ గా మన ముందకు రాబోతున్నాడు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ విపరీతంగా ఆకట్టుకోగా, మేకర్లు కాసేపటి క్రితం మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. సంపూ కొత్త సినిమా పేరు డబ్యుడబ్యుడబ్యు. వైరస్.కామ్. 'నో వ్యాక్సీన్.. ఓన్లీ టాక్సిన్' అంటూ ఓ ట్యాగ్ లైన్ కూడా తగిలించారు. ఓ పిలకతో నటరాజ స్వామి ముందు ఓ నాట్యకారుడి టైపులో మెలికలు తిరుగుతూ.. ఆపై తన స్టైల్ గల్లా లుంగీ ఒంటి కాలు ఫీట్, పక్కనే మంటల్లో కాలిపోతున్న కారు, ఇక చివరగా దూసుకొచ్చే సంపూ అసలు రూపం అందులో ఉన్నాయి.

 

భయంకరమైన హారర్ కామెడీతో పాటు.. మర్డర్ మిస్టరీతో థ్రిల్లర్ మూవీ ఇప్పటికే దర్శకుడు ఎస్.ఆర్. కృష్ణ. మరి దానికి వైరస్ కు సంబంధం ఏంటో, ఏ రూపంలో బర్నింగ్ స్టార్ కామెడీ పండించబోతున్నాడో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sampoornesh Babu  Virus Movie  Motion Poster  

Other Articles