ప్రభాస్ సినిమా టాప్ సీక్రెట్ లీక్ | top secret reveal for Prabhas movie.

Prabhas next film as top secret project

Shankar Ehsaan Loy, Prabhas next movie, Director Sujith, Bollywood composer for Prabhas, Prabhas Shankar Ehsaan Loy, Prabhas Sujith movie, Prabhas movie top secret

Bollywood composer Shankar Ehsaan Loy rope for Prabhas's next under Sujith direction.

ప్రభాస్ సినిమా నిజంగా టాప్ సీక్రెటా?

Posted: 01/20/2017 04:07 PM IST
Prabhas next film as top secret project

ఇక్కడ మనం చెప్పుకోబోయేది బాహుబలి గురించి ఏ మాత్రం కాదు. ఐదేళ్ల పాటు ప్రభాస్ ను పిప్పి పీల్చి చేసిన ప్రాజెక్టు తర్వాత చేయబోయే సినిమా గురించి. తన కోసమే రెండున్నరేళ్లుగా వేరే సినిమాలు చేయకుండా కాచుకుని కూర్చున్న దర్శకుడు సుజిత్ తో చేయబోయే మూవీ గురించి...

ప్రభాస్ ఫేట్ బాహుబలితో టోటల్ గా మారిపోయింది. ఇప్పుడు డార్లింగ్ నేషనల్ హీరోగా ప్రమోషన్ కొట్టేశాడు. దీంతో రాబోయే సినిమాపై కూడా బాలీవుడ్ కన్ను ఆటోమేటిక్ గా ఉంటుంది. అందుకే ముందుగా కేవలం బైలింగువల్ అనుకున్న సినిమాను హిందీలో కూడా దించేసేందుకు నిర్మాతలు యూవీ క్రియేషన్స్ వాళ్లు సిద్ధమైపోయారు. అందుకు తగ్గట్లుగానే ఇప్పటికే బడ్జెట్ ను మూడింతలు చేసుకున్న వాళ్లు, సినిమాకు సంబంధించి టెక్నిషియన్స్ విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

హీరోయిన్ మిగతా విషయాలు ఫైనలైజ్ ఇంకా కాకపోయినప్పటికీ, ప్రస్తుతానికి మ్యూజిక్ డైరక్టర్ మాత్రం దాదాపు ఖరారైనట్లే. బాలీవుడ్ త్రయం శంకర్ ఎహసన్ లాయ్ తాము ఓ సీక్రెట్ సినిమాకు మ్యూజిక్ సమకూరుస్తున్నామంటూ ఓ ఫోటోను పోస్ట్ చేశారు. అంతే ఇక అది ప్రభాస్ ప్రాజెక్టేనంటూ కథలు వినిపిస్తున్నాయి. మరి ప్రభాస్ ప్రాజెక్టు కు వాళ్లు ఓకే అయ్యారా? వాళ్లు చెబుతున్న ప్రాజెక్టు డార్లింగ్ దేనా? అపీషియల్ అనౌన్స్ మెంట్ కోసం వెయిట్ చేయాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Sujith  Shankar Ehsaan Loy  

Other Articles