వర్మ కామెంట్లపై చిరు రియాక్షన్, పవన్ రాకపోవటంపై కూడా... | Chiru says varma is my friend.

Chiranjeevi response on rgv comments

Megastar, Chiranjeevi, Chiru Khaidi No 150 interview, Chiranjeevi on Varma comments, Chiranjeevi about Ram Gopal Varma, RGV and Chiru, Chiranjeevi Interview, RGV comments on Naga babu, chiru on kaththi remake, Chiranjeevi Khaidi No 150 interview, Bunny in Khaidi No 150

Megastar Chiranjeevi opened up on several issues from RGV comments on Naga babu and him. Pawan Kalyan absent and doing a remake.

వర్మ ట్వీట్లపై చిరు ఏమన్నాడు?

Posted: 01/09/2017 03:05 PM IST
Chiranjeevi response on rgv comments

తన 150వ చిత్రంగా కత్తి రీమేక్ ను ఎంచుకోవటం దగ్గరి నుంచి రీసెంట్ గా వర్మ తన సోదరుడు నాగబాబు పై చేసిన కామెంట్ల దాకా చిరు రెస్పాండ్ అయ్యాడు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి అభిమానులను అలరించేందుకు రాబోతున్న బాస్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో చేస్తున్న చిట్ చాట్ లో చాలా విషయాలే చెప్పుకొచ్చాడు.

తిరిగి సినిమాలు చేద్దామనుకున్నప్పుడు సందేశాత్మక సినిమాతో వద్దామని అనుకున్నా. అయితే ప్రతీ ఒక్కరూ కమర్షియల్ ఎలిమెంట్స్ సబ్జెక్ట్స్ తోనే వచ్చారు. చివరకు రైతులకు సంబంధించిన ఈ సినిమా బాగుంటుదని ఫిక్స్ అయ్యాం అని రీమేక్స్ విమర్శలపై రెస్పాండ్ అయ్యాడు. ఇక దర్శకుడు రాంగోపాల్ వర్మ చేస్తున్న రచ్చ గురించి ప్రస్తావిస్తూ... వర్మ నా పోస్టర్ల గురించి చేసిన కామెంట్ల గురించి నాకు తెలియదు. కానీ, నాగబాబు మాత్రం చాలా ఎమోషనల్ గా మాట్లాడం చూస్తే బాగా హర్టయ్యాడని అర్థమైంది. అయితే వాటిపై స్పందించాల్సిన అవసరం నాకు లేదనిపిస్తోంది. వ్యక్తిగతంగా నాకు ఎవరితోనూ సమస్యలు లేవు. ఆర్జీవీ కూడా నాకు స్నేహితుడే.

పవన్ కళ్యాణ్ రాకపోవటంపై స్పందిస్తూ... చెర్రీ వ్యక్తిగతంగా పవన్ ను ఆహ్వానించాడు. అయితే తనకు పనులు ఉండటం మూలంగా రాలేనని తెలిపాడంట. ఆపై సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశాడన్నాడు. ఖైదీలో ప్రతీ ఒక్క మెగా హీరో గెస్ట్ రోల్ చేస్తే బాగుంటుందని అనుకున్నాం. కానీ, బలవంతంగా ఇరికించటం మూలానా అది బెడసి కొట్టే ప్రమాదం ఉంది. అందుకే ఆ యత్నం విరమించుకున్నామని వివరించాడు. బాలయ్యతో తనకు మంచి సంబంధం ఉందని, అతని సినిమా(శాతకర్ణి) కూడా హిట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. అంతేకాదు సీనియర్ హీరోలైన నాగార్జున, వెంకటేష్ లు ఇప్పటికీ తనతో మంచి సంబంధాలు కలిగి ఉంటారని, ఎవరితోనూ తనకు వైరం లేదని చిరు వివరించాడు.

ఈ పదేళ్లలో చాలా మార్పులు వచ్చాయన్న మెగాస్టార్, తన ప్రయాణంతో 150తోనే ఆగిపోదని, త్వరలో సురేందర్ రెడ్డి, బోయపాటి శీను దర్శకత్వంలో నటించబోతున్నట్లు తెలియజేశాడు. అంతేకాదు ఎప్పటి నుంచో అనుకుంటున్న ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కూడా స్క్రిప్ట్ పనులు జరగుతున్నాయని వివరించాడు చిరు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Ran Gopal Varma  tweets  Pawan Kalyan  pre release event  Kaththi remake  

Other Articles