ప్రీ రిలీజ్ పవన్ వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? | Pawan not against Khaidi No 150 Pre-Release Function.

Pawan may attend for pre relase function

Pawan Kalyan, Chiranjeevi 150th Film, Khaidi No 150, khaidi pre release event, Khaidi No 150 pre release function, Pawan Kalyan Katamarayudu shooting, Pawan ignore khaidi, Pawan Kalyan Khaidi No 150, Ciru Pawan at Khaidi pre release

Busy Pawan Kalyan Skips Chiranjeevi's 150th Film Pre-Release Event, Sends Shocking Tweets and attend in Katamarayudu shooting.

ప్రీ రిలీజ్ - పవన్ రాక... డిస్కషన్

Posted: 01/07/2017 01:09 PM IST
Pawan may attend for pre relase function

ఓవైపు మెగా రీఎంట్రీపై అభిమానులతోపాటు యావత్ తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో రిలీజ్ డేట్ దగ్గర పడింది. అయినా ప్రీ రిలీజ్ పైనే అందరి కళ్లు. అందుకు కారణం మెగా హీరోలంతా ఈరోజైనా ఒకే స్టేజీ మీద కనిపిస్తారా లేదా? అని. మరి సెంటర్ ఆఫ్ అట్రక్షన్ గా నిలుస్తాడనుకుంటున్న పవన్ కళ్యాణ్ వస్తాడా? రాడా? అన్నదే మీడియా మొత్తం హాట్ డిస్కషన్. చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల భావజాలాలు(పొలిటికల్ గా) వేర్వేరుగా ఉన్నంత మాత్రాన వారిద్దరూ విడిపోవాలి, కత్తులు దూసుకోవాలి అనే రీతిలో సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారంటూ తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేయటం తెలిసిందే.

మరోవైపు తన సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాగా.. ఇప్పుడు ఖైదీ నంబర్ 150 వేడుకకు పవన్ ప్రత్యేక అతిథిగా రాకుండా ఉంటాడా? అన్న మరో సమాధానం లేని ప్రశ్న. అల్లు అరవింద్ పవన్ బిజీ రాకపోవచ్చు అన్న కామెంట్ల నుంచి మొదలైన రచ్చ.. బాబాయ్ కోసం చెర్రీ రంగంలోకి దిగుతాడని, వదిన సురేఖ కూడా ఆహ్వానం కోసం బయలుదేరిందని ఇలా కొనసాగింది. ఇది చాలదన్నట్లు సాయంత్రం మెగా ఈవెంట్ పెట్టుకుని ఇక్కడ కాటమరాయుడు షూటింగ్ లో పాల్గొనటంతో ఆసక్తి నెలకొంది.

పవన్ తరపు నుంచి మాత్రం దీనిపై ఎలాంటి స్పందన లేదు. ఈ నేప‌థ్యంలో పవన్ కాటమరాయుడు సినిమా నిర్మాత, పవన్ క్లోజ్ ఫ్రెండ్ శరత్ మరార్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి 9 ఏళ్ల‌ తర్వాత నటించిన ఖైదీ నెం 150 చిత్రం భారీ సక్సెస్ కావాలని పవన్ కోరుకుంటున్నాడని అందులో  పేర్కొన్నారు. రాజకీయ అంశంపై ట్విట్టర్ లో అమీర్ దంగల్ గురించి పొగడటమే కాదు, కాసేపటి క్రితం రాజకీయ ట్వీట్లు చేసిన పవన్ ఖైదీ గురించి స్వయంగా ఓ ట్వీట్ చేయలేడా? అన్న ప్రశ్న ఇక్కడ కలగక మానదు. అయితే అన్న లేకపోతే తాను లేనన్న వ్యాఖ్యలు పవన్ చాలా సందర్భాలు చేసిన సందర్భంలో పిలవకపోయినా ఈవెంట్ కు వెళ్లి తీరతానని సన్నిహితులతో చెప్పాడన్న ఓ వార్త మాత్రం అభిమానులను ఖుషీ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Khaidi No 150  Pre release event  Pawan kalayan  Chiranjeevi  

Other Articles