చిరుకు వాళ్లతో పోలిక కరక్టేనా? | Chiru compare with failure stories in re entry.

Discussion on chiru came back

Chiranjeevi, Khaidi No 150, Chiranjeevi came back, Chiranjeevi re entry, Chiranjeevi after 9 years, Chiru stamina in re entry, Megastar re entry, Khaidi No 150 result

Similar re entries like Chiranjeevi with Khaidi No 150 in movies after political failures are not succeed. Can Chiru Won after 9 years?

చిరు అయినా సక్సెస్ అవుతాడా?

Posted: 01/05/2017 05:56 PM IST
Discussion on chiru came back

ఒక స్టార్ రీఎంట్రీ కోసం బహుశా ఇంతలా ఎదురు చూసినంత మరేయితర హీరోకి ఎదురు చూసి ఉండరేమో. ఒకప్పుడూ పెద్ద పెద్ద స్టార్లు సైతం ఇలా టైం తీసుకుని సినిమాలు చేసినప్పటికీ, అప్పటికీ అభిమానంపై ఇంతగా అవగాహన, పరిస్థితులు లేవు. హీరోగా లైఫ్ టైం సాధించడానికి ఎంత కష్టపడాలో, రీ-ఎంట్రీలో అది పొగొట్టుకోవటానికి కూడా ఎంతో పట్టలేదు కూడా. చరిత్రలో అందులో సంబంధించిన ఉదాహరణలు ఎన్నో. దానిని ఉటంకిస్తూ ఓ అభిమాని మెగాస్టార్ ఖైదీ నంబర్ 150 గురించి రాసిన ఓ బహిరంగ లేఖ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. దానిని ఓసారి పరిశీలిస్తే...

గతంలో బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా కూడా రాజకీయాలు, బిజినెస్ పేరుతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరం అయ్యి ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నాడు. కొంత గ్యాప్ తీసుకుని సినిమా చేశారు కానీ.. రీఎంట్రీ అట్టర్ ఫెయిల్యూర్ అయింది. ఆ తర్వాత బిగ్ బీ దేశం అంతా ముద్దుగా పిలిపించుకుంటున్న అమితాబ్ కూడా కొంత గ్యాప్ ఇచ్చి.. తిరిగి సోలో హీరోగా ట్రై చేసిన వాడే. కానీ, అది బాలీవుడ్ జనాలకు కిక్కు ఇవ్వలేకపోయింది. అయితే సీనియర్ కేరక్టర్లలోకి మారిపోయి మాత్రం అలరిస్తూనే ఉన్నాడు. ఇక సౌత్ విషయానికొస్తే ఎంజీఆర్, ఎన్టీఆర్ లు రాజకీయాలతో బిజీ అయి మళ్లీ సినిమాలు చేసినా అది పూర్తి స్థాయిలో హీరోగా మాత్రం రాణించలేకపోయాడు.

టాలీవుడ్ లో అయితే సూపర్ స్టార్ కృష్ణను చెప్పుకోవాలి. 90లో కూడా నటవారసులకు పోటీగా నెంబర్ వన్.. అమ్మదొంగా.. సంప్రదాయం లాంటి సినిమాల తర్వాత హిట్లు కొట్టి సోలో హీరోగా నటశేఖరుడు ప్రభంజనం రేపాడు. అయితే తర్వాత రాజకీయ ప్రవేశం, ఆపై తిరిగి హీరోగా ఎన్ని ప్రయత్నాలు చేసి రీఎంట్రీలు ఇచ్చినా కృష్ణ మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లు సక్సెస్ అయినప్పటికీ, అవి పూర్తి స్థాయిలో లేదనే చెప్పుకోవాలి. ఇన్నాళ్ల తర్వాత చిరు రీఎంట్రీ మూలంగా ఇప్పుడు వీళ్లందరినీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది.

మెగాస్టార్ గ్యాప్ తక్కువేం కాదు. దాదాపు దశాబ్దం తర్వాత. మాములుగా అయితే ఇంత హైప్ ఉండకపోయేదేమో. కానీ, బిగ్గర్ దేన్ బచ్చన్ గా దేశం మొత్తం పేరు సంపాదించుకున్న చిరు కావటమే ఇందుకు కారణం. అసలు ఇంత ఎక్కువ గ్యాప్ తీసుకుని తిరిగి సోలో హీరోగా అరంగేట్రం చేయడం ఇదే ఫస్ట్ టైం కూడా మరో కారణం కావొచ్చు. రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయినా చిరు మరి రీ ఎంట్రీ లో తన స్టామినాను చూపిస్తాడా? అన్నదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇదే టైంలో ల్యాండ్ మార్క్ చిత్రం, మెగా హర్ట్ కోర్ అభిమానులు, విమర్శకులు, రికార్డులు ఇవేవీ సినిమాకు ప్రమాణం కావు, సగటు ప్రేక్షకుడిని సైతం అలరించడమే అసలైన విజయం అన్న ఫార్ములాను చిరు మరోసారి నిరూపిస్తే చాలూ.

ఈ సందర్భంగా ఠాగూర్ ఆడియో పంక్షన్ సందర్భంగా శిల్పకళావేదికలో చిరు చెప్పిన మాటలను లేఖలో అతగాడు ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘‘నా కెరీర్ లో వెనక్కి తిరిగి చూడను. అవి నన్ను అక్కడితోనే ఆపేస్తాయి. అందుకే ముందుకు దూసుకెళ్లిపోవటమే నా ముందున్న లక్ష్యం’’. మరి ఆ టార్గెట్ ను చిరు అందుకోవాలని ఆశిద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Political failure  Movies re entry  150th movie  Khaidi No 150  

Other Articles