ఖైదీ ప్రీరిలీజ్ వాయిదా... ఎవరూ అడ్డుకోవట్లేదు.. కారణం ఏంటి మరి? | reason behind Khaidi No 150 pre release postponed.

Khaidi no 150 pre release function postponed

Khaidi No 150 pre release event, Khaidi No 150 Pre release function, Khaidi No 150 Guntur Hailand, Chiranjeevi 150th Movie, Chiru Pre release event, Khaidi No 150 pre release event, Venue for khaidi no 150 event, Khaidi date change

Megastar Khaidi No 150 Pre release function postponed to 7th at Guntur Hailand. No political scene behind Khaidi pre release event.

ప్రీరిలీజ్ వాయిదా కారణం వేరే ఉందంట!

Posted: 01/02/2017 11:07 AM IST
Khaidi no 150 pre release function postponed

తొమిదేళ్ల తర్వాత గ్రాండ్ గా రీఎంట్రీ ఇవ్వబోతున్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' కు అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహణకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. తొలుత విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించాలనుకున్న నిర్వాహకులకు అనుమతి నిరాకరణ ఊహించని షాకిచ్చింది. దీంతో గుంటూరులోని స్టేడియంలో నిర్వహించాలకున్నారు. కానీ, అక్కడ కూడా చుక్కెదురైంది.

దీని వెనుక పెద్ద కుట్ర(రాజకీయ?) దాగి ఉందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపించారు కూడా. అనుమతులు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని, ఒకవేళ ఫంక్షన్ జరగకుండా అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే దీనిపై మూవీ పీఆర్వో సురేష్ కొండేటి వాదన క్లారిటీ ఇచ్చాడు. విజయవాడ మైదానంలో సినిమా, ప్రైవేటు ఫంక్ష‌న్లు నిర్వ‌హించుకూడ‌ద‌ని ఇంతకు ముందు కోర్టు ఆర్డ‌ర్ ఇచ్చింది. కానీ, వాటిని గమనించకుండా అధికారులు అనుమ‌తులు మంజూరు చేశారు. ఆపై పాత ఆదేశాలను మళ్లీ పునపరిశీలన చేసుకోవటంతో ఖైదీ నెం.150కి ఇచ్చిన అనుమ‌తులు వెన‌క్కి తీసుకొన్నారు” అంటూ తేల్చేశాడు.

మరోవైపు గుంటూరులోని హాయ్ ల్యాండ్ లో ముందుగా చెప్పినట్లు 4న కాకుండా 7వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి పనులను ఈవెంట్ నిర్వాహకులు మొదలుపెట్టేశారు. 11న ఖైదీ నంబర్ 150 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Mega star  Chiranjeevi  150th movie  Khaidi No 150  Pre release function  postpone  January 7th  

Other Articles