కొత్త సంవత్సరం కాటమరాయుడి ట్రీట్ డోంట్ మిస్ | Katamarayudu makers announced teaser date.

Katamarayudu official teaser date announced

Katamarayudu official teaser, Producer Sharrath Marar, Pawan kalyan, Pawan January 1st, Pawan kalyan New Year treat, Katamarayudu New Year gift, Katamarayudu teaser, Katamarayudu official teaser, Pawan Kalyan katamarayudu offical teaser, Katamarayudu teaser date, Sharrath Marar Katamarayudu

Producer Sharrath Marar announced Katamarayudu official teaser date.

కొత్త సంవత్సరం కాటమరాయుడి ట్రీట్

Posted: 12/28/2016 05:26 PM IST
Katamarayudu official teaser date announced

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ కాటమరాయుడు కొత్త పోస్టర్ కాసేపటి క్రితం విడుదలైంది. పంచె కట్టు, కిర్రు చెప్పులతో నడుస్తున్నట్లు ఉన్న పవన్ ముఖ భాగం చూపించకుండానే నడుస్తున్నట్లు పవర్ ఫుల్ గానే ఉంది. న్యూ ఇయర్ కి టీజర్ రిలీజ్ చేస్తామంటూ నిర్మాత శరత్ మరార్ తన ట్విట్టర్ ఖాతాలో ఫోటోను షేర్ చేశాడు.

మొదట్లో పవన్ ఫొటోతో టైటిల్ లోగోను తయారు చేసి దాన్నే కాటమరాయుడు ఫస్ట్‌లుక్ అంటూ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆ తర్వాత దీపావళికి సైకిల్ మీద, హీరోయిన్ శృతీహాసన్ తో దీపావళి వేడుక జరుపుకుంటున్నట్లుగా విడుదల చేసినా అభిమానులకు అదంతగా కిక్ ఇవ్వలేదు. కానీ, అభిమానులకు న్యూ ఇయర్ కిక్ ఇచ్చేలా.. కొత్త సంవత్సరంలో కాటమరాయుడు పలకరించబోతున్నాడంటూ కొత్త పోస్టర్ ను విడుదల చేసి కాస్త సస్పెన్స్ కి తెరలేపాడు మరార్. ఇక జనవరి 1న సినిమాకు సంబంధించిన పూర్తి స్థాయి పోస్టర్‌తో కాటమరాయుడు సిద్ధమైపోతున్నాడట.

అజిత్ హీరోగా వచ్చిన తమిళ హిట్ మూవీ వీరమ్ రీమేక్ గా కాటమరాయుడు తెరకెక్కనుంది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, గోపాల గోపాల చిత్రాల దర్శకుడు డాలీ(కిషోర్ పార్థసారథి) డైరక్షన్ లో ఈ పవర్ ఫుల్ ఫ్యాక్షన్ కమర్షియల్ డ్రామా తెరకెక్కుతోంది. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు. పొలాచ్చిలో ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి చివరి వారంలో విడుదల కానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Katamarayudu  Teaser  New Year gift  

Other Articles