కబాలి ఇంకో రికార్డు.. అదుర్స్ కదా | Kabali rules youtube.

Kabali teaser another record

Kabali Trailer, Kabali Teaser, Rajinikanth shakes youtube, Rajinikanth Kabali teaser, kabali teaser, Youtube 2016 videos, Kabali youtube record, Rajanikanth Kabali teaser, Rajinikanth kabali Trailer, Kabali 2016, Kabali Youtube

YouTube declares Rajinikanth’s Kabali the top trending trailer of 2016.

యూట్యూబ్ లో రజనీ మరో రికార్డు

Posted: 12/09/2016 06:39 PM IST
Kabali teaser another record

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మరో సంచలన రికార్డును క్రియేట్ చేశాడు. ప్రతీయేటా బాలీవుడ్ హీరోల ఖాతాలో ఉండే దానిని ఈ యేడు తలైవా తన ఖాతాలో వేసుకోవటం విశేషం. ఈ యేడాది వచ్చిన కబాలీ చిత్ర ట్రైలర్ 2016 సంవత్సరానికిగానూ టాప్ జాబితాలో నిలిచింది. ఈ విషయాన్ని యూట్యూబ్ అధికారికంగా ప్రకటించింది.

2016 లో యూట్యూబ్‌లో కబాలి ట్రైలర్ టాప్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. 2016కి గానూ టాప్‌ 10 ట్రెండింగ్‌లో ఉన్న వీడియోలు, మ్యూజిక్‌ వీడియోలు, బాలీవుడ్‌ ట్రైలర్ల జాబితాల గురించి తెలిపింది. అందులోనే క‌బాలీ హ‌వా కొన‌సాగిన‌ట్లు చెప్పింది. టాప్‌ ట్రెండింగ్‌ ట్రైలర్‌గా క‌బాలి ఉండ‌గా, హిందీలో ప్ర‌సార‌మ‌వుతున్న‌ కపిల్‌శర్మ షోకు సల్మాన్‌ ఖాన్‌ అతిథిగా వెళ్లిన ఎపిసోడ్ టాప్‌ ట్రెండింగ్‌ వీడియోగా ఉంది.

 

మొత్తం మూడు కోట్లకు పైగా వ్యూవ్స్ తో ఈ యేడాది వచ్చిన ఇప్పటికే వచ్చిన సల్మాన్ ఖాన్ సుల్తాన్, క్రిస్మస్ కి రాబోతున్న అమీర్ దంగల్ చిత్రాలను ఈ ఫీట్ ను అందుకోకపోవటం విశేషం. అంతేకాదు ఇండియాలోనే ఫాస్టెస్ట్ మిలియన్ వ్యూవ్స్ సాధించిన చిత్రంగా కబాలి మరో రికార్డు అప్పట్లోనే క్రియేట్ చేసింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కబాలి డివైడ్ టాక్ వచ్చిన సుమారు 500 కోట్ల కలెక్షన్లతో సెన్సేషన్ అయి కూర్చుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Kabali Teaser  Youtube 2016  

Other Articles