కోమలవల్లి నుంచి కళైమామణిగా జయ సినీ ప్రస్థానం | Jayalalithaa movie life journey.

Jayalalitha journey as movie queen

Jayalalitha, Jayalalithaa movie career details, Jayalalithaa movies, Kalaimamani Jayalalithaa, Jayalalitha cine carrier, Jayalalitha sobhanbabu affair

Kalaimamani Jayalalithaa movie career details.

కోమలవల్లి సినీ కెరీర్ ఎలా సాగిందంటే...

Posted: 12/06/2016 09:28 AM IST
Jayalalitha journey as movie queen

దేశంలోనే సినీ ఫీల్డ్ నుంచి వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మొదటి మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు కళైమామణి జయలిత. 1961 నుంచి 1980 వరకు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ చిత్రసీమలో టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. తల్లి వేదవతి (సంధ్య) బలవంతంపై చిన్న వయస్సులో సినిమా రంగంలోకి వచ్చారు. ఆ టైంలో ఉన్న దాదాపు అందరు అగ్రహీరోలతో నటించిన జయ తన అందంతో.. అభినయంతో.. జనాన్ని కట్టిపడేశారు.

ఒకప్పటి అందాల తార.. ఆమె సినీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే... చిన్నప్పటి నుండే కళల మీద ఆసక్తి కలిగిన జయ మూడేళ్ల వయసు నుంచే క్లాసికల్ మ్యూజిక్‌తో పాటుగా భరత నాట్యం, మణిపురి, కథక్‌లాంటివి నేర్చుకున్నారు. 1961లో జయలలిత 'శ్రీశైల మహాత్మ్యం' అనే సినిమాలో బాల నటిగా కనిపించారు. అయితే అంతకు ముందే మాజీ భారత రాష్ట్రపతి వీవీ గిరి కుమారుడు శ్రీ శంకర్‌ గిరీ 1961లో నిర్మించి, దర్శకత్వం వహించిన 'ఎపిస్టిల్‌' అనే ఆంగ్ల లఘు చిత్రంలో ఆమె నటించారు. ఇక 1962లో కృష్ణ అనే రోల్ లో ఓ మూడు నిమిషాల డ్యాన్స్ సీక్వెన్స్ లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చిన్న చిన్న వేషాలతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత నెమ్మదిగా నిలదొక్కుకున్నారు

తన 15వ ఏటనే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు జయలలిత. 'వెన్నిర అదయ్‌' అనే తమిళ చిత్రంలో తొలిసారిగా లీడ్‌ రోల్‌లో 'యువ వితంతువుగా' నటించారు. ఈ చిత్రానికి యు సర్టిఫికేట్ రావడంతో చిన్న పిల్లలతో పాటు.. జయలలిత కూడా చూడలేక పోయారు. ఆమె మొదటి సినిమా కన్నడలో వచ్చిన చిన్నద గొంటె. మొదటి సినిమాకు ఆమె తీసుకున్న పారితోషికం 3వేల రూపాయలు. ఫస్ట్ సినిమాతోనే బంపర్ హిట్ కొట్టి తానేంటో నిరూపించుకున్నారు జయ. కన్నడ సినిమా హిట్ తో తమిళంలో అవకాశాలను సొంతం చేసుకున్నారు జయలలిత.

ఓ డాన్స్ ప్రోగ్రాంలో ఆమె డాన్స్ చూసిన ఎంజీఆర్ తన పక్కన ఆయురత్తిల్ ఒరువన్ లో చాన్స్ దక్కించుకున్నారు జయ. అదే ఆమెకు టర్నింగ్ పాయింట్ అయింది. అది బంపర్ హిట్ కావటంతో.. ఎమ్జీఆర్-జయలలిత కాంబినేషన్ లో సినిమాలు వరుసగా వచ్చాయి. 1967 నుంచి 1973 వరకు ఆరేళ్లలో వీరిద్దరూ కలిసి 27 సినిమాల్లో నటించారు.

ఇక తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా మనుషులు మమతలు.. టాలీవుడ్ లో ఆమెను టాప్ రేంజ్ లో నిలబెట్టింది. నాగేశ్వరరావు హీరోగా చేసిన ఈ సినిమాతో తెలుగులోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు జయలలిత. నాగేశ్వరరావుతో కలిసి 7 సినిమాలు చేశారు జయ. ఎంజీ రామచంద్రన్ తర్వాత అత్యధికంగా శివాజీ గణేశన్ తో కలిసి 17 సినిమాల్లో నటించారు జయలలిత. ఆ తర్వాత ఎక్కువగా ఎన్టీఆర్ పక్కన 12 సినిమాల్లో చేశారు. జయలలిత 85 తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. వీటిలో 80 చిత్రాలు సూపర్‌ హిట్టయ్యాయి. తెలుగులో 25 చిత్రాలు మాత్రమే హిట్టయ్యాయి.

కృష్ణ, శోభన్ బాబుతో చేసిన సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించాయి. తెలుగులో చివరగా 1980లో నాయకుడు వినాయకుడు మూవీలో నాగేశ్వరరావుతో కలిసి నటించారు జయలలిత. ధర్మేంద్రతో కలిసి హిందీలో ఇజ్జత్ సినిమాలో నటించారు జయ. తన సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిద్యభరిత పాత్రలలో మెప్పించారు. జనం మదిలో నిలిచిపోయారు జయలలిత.

శోభన్ బాబు అఫైర్ పుకార్లు...
తెలుగు అందాల నటుడు శోభన్‌బాబు(వివాహమైన తర్వాత)ను ప్రేమించగా, ఆ ప్రేమ ఫలించక ఆత్మహత్యాయత్నం చేసినట్టు ఓ పుకారు ఉంది. ఆ సమయంలోనే ఎంజీ.రామచంద్రన్‌ ఆమెకు ఎంతో నచ్చచెప్పి 1982లో రాజకీయాల్లోకి తీసుకొచ్చారట. ఇది 1981లో జరిగింది. అయితే వారిద్దరికి సీక్రెట్ గా వివాహం జరిగిందని, ప్రియా మహాలక్ష్మీ అనే కూతురు కూడా పుట్టిందనే ఓ పుకారు కూడా అప్పట్లో షికారు చేసింది.

Jayalalitha Shoban Babu untold story

ఇంగ్లీషు నవలలు ఎక్కువ చదివేవారు. ఎక్కడికి షూటింగ్‌కు వెళ్లినా చేతిలో పుస్తకం ఉండాల్సిందే. రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆమె ఇంగ్లీషు నవలలను వదల్లేదు. జయలలిత 'తాయ్‌' (అమ్మ) పేరుతో తమిళ పత్రికలు వ్యాసాలు రాసేవారు. ఓ నవల కూడా రాశారట. 1972లో తమిళనాడు ప్రభుత్వం జయలలితను కళైమామణి పురస్కారంతో సత్కరించింది. తెలుగులో శ్రీ కృష్ణ సత్యకు గానూ ఫిల్మ్ ఫేర్ పురస్కారం దక్కింది. ఎన్నో సంస్థలు, కళా సంఘాలు ఆమెకు ఎన్నో బిరుదులు, సత్కారాలు అందజేశాయి. బరువెక్కిన హృదయాలతో ఆమె అభిమానులు విషాదంలో మునిగిపోయివున్నారు.

 

తెలుగులో ఆమె చేసిన చిత్రాలు
మనుషులు మమతలు
కథానాయకుడు
ఆమె ఎవరు?
ఆస్తిపరులు
గూఢచారి 116
గోపాలుడు-భూపాలుడు
చిక్కడు-దొరకడు
కదలడు- వదలడు
బ్రహ్మచారి
సుఖదుఃఖాలు
అదృష్టవంతులు
తిక్క శంకరయ్య
ఆదర్శ కుటుంబం
అలీబాబా 40 దొంగలు
గండికోట రహస్యం
శ్రీకృష్ణ విజయం
శ్రీకృష్ణ సత్య
దేవుడమ్మ
శ్రీరామకథ
నవరాత్రి (గెస్ట్ రోల్)
ప్రేమలు పెళ్లిళ్లు
డాక్టర్‌బాబు
భార్యాబిడ్డలు
దేవుడు చేసిన మనుషులు
నాయకుడు వినాయకుడు

తమిళంలో ఆమె నటించిన చివరి చిత్రం నింగ నల్లా ఇరుక్కునంలో (1992) ముఖ్యమంత్రి పాత్రలోనే గెస్ట్ రోల్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Jayalalitha  filmography  

Other Articles