ఒక్క ఫ్లైట్ జర్నీతో సీన్ మొత్తం రివర్స్ | Vakkantham Vamshi narrates story to allu arjun at airport.

How vamshi got offer with allu arjun

Vakkantham vamshi, AlluArjun, Vamshi Bunny Movie, Vakkantham Vamshi Bunny Movie, Vakkantham Vamshi Directorial debut, Allu Arjun new movie

Vakkantham Vamshi explained how he got opportunity with Allu Arjun.

అసలు అవకాశం ఎలా దక్కిందంటే...

Posted: 11/25/2016 01:04 PM IST
How vamshi got offer with allu arjun

ప్రస్తుతం ఒక క్రేజీ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేయటం కాదు, షూటింగ్ మొదలయ్యేదాకా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి నెలకొంది. ఊహించని పరిణామాలతో ఒకరితో అనుకున్న సినిమా మరోకరితో తీయాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. కారణాలు ఏవైనా కథలు ఒకరి కాంపౌండ్ నుంచి మరోకరి కాంపౌండ్ లోకి జంప్ కావటం కొత్తేమీ కాదు.

రైటర్ గా బ్లాక్ బస్టర్లు అందించిన వక్కంతం వంశీ జూనియర్ ఎన్టీఆర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో డైరక్టర్ గా డెబ్యూ ఇస్తానని మాటివ్వటం, జనతా గ్యారేజ్ తర్వాత ఆ సినిమా తెరకెక్కుతుందని చెప్పేయటం అంతా జరిగిపోయాయి. కానీ, ఎన్టీఆర్ ఇచ్చిన ట్విస్ట్ తో వంశీ నిరాశలోకి కూరుకుపోయాడు. ఇదిలా ఉంటే అటు ఇటు తిరిగి ఇప్పుడు ఆ ఛాన్స్ అల్లు అర్జున్ ఇవ్వటం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై వంశీ వివరణ ఇచ్చాడు.

లింగుస్వామి సినిమా అనౌన్స్ మెంట్ కోసం చెన్నై వెళ్తున్న క్రమంలో బన్నీ, ఏదో పని మీద ఎయిర్ పోర్ట్ కి వెళ్లిన వంశీ మీట్ అయ్యాడంట. అలా మాటల మధ్యలో వంశీ ఓ స్టోరీ లైన్ వినిపించాడంట. అంతే మారు మాట్లాడకుండా బన్నీ దానిని ఓకే చేయటం, దువ్వాడ తర్వాత ఈ ప్రాజెక్టునే తెరకెక్కించాలని డిసైడ్ అయిపోవటం చకచకా జరిగిపోయాయి. లగడపాటి శిరీష్-నాగబాబు సంయుక్త నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కబోతుందని, లింగుస్వామి సినిమా కన్నా ముందే ఇది ప్రారంభం కాబోతుందని సమాచారం.

అయితే టెంపర్ లాంటి టర్నింగ్ పాయింట్ సినిమా ఇచ్చిన వంశీని జూనియర్ నమ్మకపోగా, ఎవడు,, రేసుగుర్రంలకు కథ అందించిన అతని పనితనం నచ్చి బన్నీ అవకాశం ఇవ్వటం ఇక్కడ విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Vakkantham Vamshi  Movie  

Other Articles