నానితో ప్రియాంక చోప్రా సినిమా? | Priyanaka Chopra interested in Nani.

Priyanka chopra choosing nani

Hero Nani, Priyanka Chopra, Priyanka Chopra Nani, Nani Priyanka Chopra, Priyanka Chopra Producer telugu movie, Priyanka Chopra Telugu movie, Natural Star Priyanka Chopra, PC Nani, Nani in PC movie

Nani under Priyanka Chopra production house.

ప్రియాంక చోప్రాతో నాని సినిమానా?

Posted: 11/23/2016 04:29 PM IST
Priyanka chopra choosing nani

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు ప్రమోట్ అయిన ప్రియాంక చోప్రా డెబ్యూ తెలుగు చిత్రంతోనే(అపురూపం) అని ఎంత మందికి తెలుసు? కాకపోతే ఆ సినిమా రిలీజ్ కాకుండా పోయింది లేండి. ఆపై బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న ప్రియాంక చోప్రా, ఇంకోవైపు హాలీవుడ్ లోనూ సీరియళ్లు, సినిమాలతో తన జెండాను ఎగరవేస్తుంది. అదే టైంలో ఒక వైపున వరుస సినిమాలు చేస్తూనే, మరో వైపున నిర్మాతగాను రాణించడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.

ముఖ్యంగా ఇతర భాషల్లో సినిమాలు నిర్మించడానికి ఆమె ఆసక్తిని చూపుతోంది. ఇప్పటికే ఆమె నిర్మిస్తోన్న ఒక చిత్రం పంజాబీ .. మరాఠీ సినిమాలు సెట్స్ పై వున్నాయి. అదే సమయంలో సౌత్ లో కూడా పాగా వేయాలన్న కోరికలో పింకీ ఉందంట. అందుకు కోసం ముందుగా తెలుగు సినిమాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చూస్తోందని సమాచారం. అయితే తెలుగులో మినిమమ్ గ్యారెంటీ గల హీరోల జాబితాను ఆమె సిద్ధం చేసుకుందనే టాక్ వినిపిస్తోంది.

ఆ లెక్కన్న వరుస హిట్లతో ఆ పేరును సార్థకం చేసుకున్న నానితోనే మొదటి సినిమా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓ మోస్తరు బడ్జెట్ తో యంగ్ డైరక్టర్లతో సినిమా నిర్మించేందుకు ప్రియాంక అల్రెడీ ప్రయత్నాలు ప్రారంభించి, కన్ఫర్మ్ చేసుకుందని కూడా చెప్పేసుకుంటున్నారు. అన్నీ కుదిరితే త్వరలోనే నేచురల్ స్టార్ తో సినిమాపై ఓ స్పష్టమైన ప్రకటన రావొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanaka Chopra  Producer  Telugu Movie  Hero Nani  

Other Articles