స్పీడ్ గా అయ్యింది మరి క్వాలిటీ ఉందా అసలు? | Khaidi no 150 speedy and risky.

Negative shadows on khaidi no 150

Chiranjeevi, 150th movie, Khaidi No 150, 150 Shooting completed, Khaidi risk, 150 movie speed, Risk on Khaidi 150, Negative shades on Chiru 150, Khaidi talkie part completed,

Analysis on Chiru 150 movie Khaidi no 150 after completion talkie part.

బాస్ ఈజ్ బ్యాక్ అప్పుడే పోస్ట్ మార్టం

Posted: 11/23/2016 01:32 PM IST
Negative shadows on khaidi no 150

దాదాపు 9 ఏళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి తిరిగి మేకప్ వేసుకున్నాడు. కత్తి రీమేక్ గా 150 చిత్రాన్ని ఎంచుకుని శరవేగంగా షూటింగ్ పూర్తి చేశాడు. ఓ రీమేక్ తో వస్తున్నాడని అభిమానులు కాస్త నిరాశ పడ్డప్పటికీ, మెసేజ్ ఓరియంటల్ , పైగా రైతులకు సంబంధించింది కావటంతో ఓవరాల్ గా హ్యాపీగానే ఫీలయ్యారు. అయితే సినిమా ఇంత ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకోవటంతో క్వాలిటీ పై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయ్..

నిజానికి కత్తి రీమేక్ గురించి అక్కడ సినిమా రిలీజ్ అయిన సందర్భం నుంచే చర్చలు జరిగాయి. అల్రెడీ తెలుగులో డబ్ అయిన చిత్రాన్ని రిలీజ్ కాకుండా ఆపేసి చెర్రీ రైట్స్ కొనేసుకున్నాడు. ఏడాది క్రితమే చిత్ర షూటింగ్ మొదలు కావాల్సి ఉంది కూడా. కానీ, అలా జరగలేదు. ఈ యేడాది జూన్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై కేవలం మూడంటే నాలుగంటే నాలుగు నెలలో మొత్తం పార్ట్ కంప్లీట్ చేసేసుకుంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు ఇంత త్వరగతిన పూర్తి చేయటంపైనే ఇప్పుడు అసలు సమస్య మొదలైంది.

సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ చేయాల్సి రావటం, పైగా పోటీగా బాలయ్య వంద చిత్రం ఉండటంతో భారీ రేటుకు కొనుగొలు చేసిన డిస్ట్రిబ్యూటర్లలో క్రమంగా భయం మొదలైంది. టోటల్ గా సీరియస్ సబ్జెక్ట్ అయిన కత్తిలో ఎంటర్ టైన్ మెంట్ పాలు చాలా తక్కువ. విజయ్ స్టార్ డమ్, ఫస్ట్ టైం ఇలా మెసేజ్ ఓరియంటల్ సబ్జెక్ట్ తో రావటం మూలంగానే సినిమా అక్కడ ఘన విజయం సాధించింది. మరి చిరు అంటే జనాలు ఖచ్ఛితంగా ఎంటర్ టైన్ మెంట్ ఆశించకమానరు. అలాంటప్పుడు కత్తి అదేనండీ ఖైదీనంబర్ 150 జనాలను ఏ మేర సంతృప్తి పరుస్తుందన్నదే అసలు మ్యాటర్.

కానీ, వినాయక్ సినిమాల్లో ఉండే కామెడీ టచ్ ఇందులోనూ కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం, ఆపై చెర్రీ ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉండటం, అన్నింటికి మించి మెగా పవర్ సినిమాపై పాజిటివ్ బజ్ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఏళ్లపాటు టాలీవుడ్ ను ఏలిన ఓ అగ్రహీరో రీ ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఫస్ట్ లుక్ దగ్గరి నుంచి ఇలా ప్రతీ దాంట్లో లోతుగులు వెతికేస్తున్నారు. అయినా ఇది కూడా ఒకందుకు మంచిందనే చెప్పాలి. ఎందుకంటే భారీ అంచనాలతో వస్తున్న సినిమాలు బొక్కబోర్లా పడుతున్న సమయంలో ఈ నెగటివ్ అంశాలే రేపు సినిమా బ్లాక్ బస్టర్  అయ్యేందుకు సానుకూలం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  150 movie  Khaidi No 150  Analysis  

Other Articles