నోట్ల రద్దుపై జనసేన అధినేత నర్మగర్భ వ్యాఖ్యలు Pawan Kalyan slams Centre's demonetisation move

Pawan kalyan slams centre s demonetisation move

Actor Pawan Kalyan,Jana Sena Party chief,Narendra Modi,Pawan Kalyan attacks Narendra Modi,Narendra Modi Government, demonetisation causing problems, Pawan Kalyan on delegalizing tender, Pawan Kalyan on demonetisation

Jana Sena Party chief Pawan Kalyan criticises the Modi government for creating problems to the public by the demonetisation move.

నోట్ల రద్దుపై జనసేన అధినేత నర్మగర్భ వ్యాఖ్యలు

Posted: 11/20/2016 04:39 PM IST
Pawan kalyan slams centre s demonetisation move

పెద్ద నోట్ల రద్దుపై జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ తొలిసారి స్పందించారు. ప్రస్తుతానికి కొత్త కరెన్సీ ఎంతమేర అందుబాటులో ఉందో ప్రభుత్వం బహిర్గతం చేయాలని ఆయన కోరారు. రహస్యంగా ఉంచాలనే భావనతో ఈ విషయాన్ని దాచడం మంచిది కాదని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అసంఘటిత పట్టణ మార్కెట్ల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా, డబ్బు తీసుకోవడానికి క్యూ లైన్లలో ఉండే వయోవృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

నోట్ల రద్దుతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని... ప్రజల్లో ఉన్న అశాంతిని తొలగించడానికి ప్రభుత్వం సరైన చర్యలను వెంటనే తీసుకోవాలని సూచించారు. ఈ విషయాలను ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందే కేంద్ర ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదని ఈ సందర్భంగా పవన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గమనిస్తుంటే... నోట్లను రద్దు చేయడానికి ముందు ఎలాంటి ఎక్సర్ సైజ్ చేయలేదనే విషయం అర్థమవుతోందని చెప్పారు. అంతేకాకుండా, నోట్ల రద్దుతో తలెత్తబోయే ఇబ్బందులను ముందే అంచనా వేయలేకపోయారని తెలిపారు.

దీంతో పాటు పెద్దనోట్ల రద్దుపై సామాన్యుడి స్పందన తెలియజేసే ఓ అద్భుతమైన కవితను పవన్‌ కల్యాణ్‌ షేర్‌ చేసుకున్నారు. సినీ రచయిత సాయిమాధవ్‌ దీనిని రాశారు. ‘మెతుకూ మెతుకూ కూడబెట్టి ముద్దపోగేస్తే.. దొంగ కూడంటున్నారన్నా నేనెట్టా బతికేది?, కన్నీటి బొట్టూ బొట్టూ దాపెట్టి ఏడుపు పోగేస్తే.. నా ఏడుపు చెల్లదంటున్నారన్నా నేనెట్టా చచ్చేది’  పెద్దనోట్ల రద్దుతో సామాన్యుడు పడుతున్న కష్టాలకు అద్దంపట్టేలా సాయిమాధవ్‌ రాసిన ఈ హృద్యమైన కవిత నెటిజన్లను కదిలిస్తున్నది.  వాస్తవిక పరిస్థితికి దర్పణం పట్టిన ఈ కవితను నెటిజన్లు షేర్‌ చేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pawan Kalyan  demonetisation  saimadhav poem on cash ban  janasena  union government  

Other Articles