రోబో 2.0 ఫస్ట్ లుక్ అఫీషియల్ కాదా? | Akshay Kumar as Bad guy in Enthiran 2 aka Robo 2.0 First Look Poster.

Enthiran 2 aka robo 2 0 first look poster

Enthiran 2, Robo 2.0, Robo 2.0 First Look, Enthiran 2 First Look, Akshay Kumar in Robo 2.0, Pre look poster of Enthiran 2, Pre look poster of Robo 2.0

Enthiran 2 aka Robo 2.0 First Look Poster released.

రోబో ఫ్రీలుక్ సరే.. మరి అందులో ఉందెవరు?

Posted: 11/17/2016 09:18 AM IST
Enthiran 2 aka robo 2 0 first look poster

సూపర్ స్టార్ ను మళ్లీ రోబోగా మార్చేసిన దర్శకుడు శంకర్ ప్రస్తుతం 'రోబో 2.0' చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు. తలైవా సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్ గా .. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కనిపించనున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను .. ఫస్టులుక్ ను ముంబైలో ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొంతకాలం క్రితమే చెప్పారు.

రోబో సీక్వెల్ ‘2.0’ టైటిల్ లోగో అంటూ కొన్ని రోజుల కిందట ఒక ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. క్వాలిటీ ఓ రేంజిలో ఉండటంతో అది అఫీషియల్ లోగో అనే నమ్మారు జనాలు. కానీ అది అఫీషియల్ లోగో కాదని శంకర్ అండ్ టీ క్లారిటీ ఇచ్చింది. ఇక డైరక్టర్ శంకర్ ఇప్పుడు ‘2.0’ లోగోను అధికారికంగా లాంచ్ చేశాడు.

‘2.0’ మీద ఉన్న అంచనాలకు తగ్గట్లే ఉంది ఈ టైటిల్ లోగో. వందలాది రోబోల్ని చేర్చి ఈ లోగోను రూపొందించారు. క్లోజప్ లో చూస్తే లోగోలో రోబోలున్న సంగతి అర్థమవుతుంది. శంకర్ టెక్నికల్ బ్రిలియన్స్ ఈ లోగోలోనే తెలిసిపోతోంది. కింద మనిషి ఆకారం నీడ లాగా కనిపిస్తోంది. అయితే రజనీది మాత్రం కాదు. ఇందులో విలన్ పాత్ర పోషిస్తున్న అక్షయ్ కుమార్ ది. రజనీని కాకుండా అక్షయ్ ను హైలెట్ చేస్తూ ఫస్ట్ లుక్ వదలటం ప్రత్యేకంగా చెప్పుకొవచ్చు. ఎటోచ్చి రజనీ పేరు స్పెల్లింగ్ ను Rajni అని కాకుండా Rajanikanth అని వేయటం కొసమెరుపు.  ఈనెల 20వ తారీఖున ముంబయిలోని ప్రముఖ యశ్ రాజ్ స్టూడియోలో ‘2.0’ ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయబోతున్నారు. కరణ్ జోహార్ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చే్స్తుండటం విశేషం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Robo 2.0. Pre look poster  Firstlook  

Other Articles