ఫ్యాన్ కోసం పార్ట్ నర్ గా మారిన పవన్ | Nithin Movie Under Pawan kalyan Production

Nithin movie under pawan kalyan production

Nithin, Pawan kalyan, Nithin pawan kalyan, Nithin New Movie, Pawan Kalyan Production house, Pawan Kalyan creative works, Pawan Kalyan producer, Nithin new producer

Pawan kalyan turns producer for Nithin Movie.

నితిన్ కొత్త సినిమాకు పవన్ నిర్మాత

Posted: 11/16/2016 01:37 PM IST
Nithin movie under pawan kalyan production

టాలీవుడ్ లో పవర్ స్టార్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేందుకు ఇప్పుడున్న యువ హీరోలు, హీరోయిన్లు కూడా పవన్ కి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అలాంటి వాళ్లలో నితిన్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. తన సినిమాలో పవన్ పోస్టర్లు, సందర్భాలను వాడటం దగ్గరి నుంచి ఫంక్షన్లలో వీరాభిమానం చాటుతూ ఉంటాడు.

అతని తాపత్రయం, కష్టం మెచ్చిన పవన్ కూడా అతన్ని ఆశీర్వదిస్తూ వస్తుంటాడు. అలాంటి నితిన్ కు ఇప్పుడు బంఫరాఫర్ తగిలింది. ఏకంగా పవన్ నిర్మాణ సంస్థలోనే సినిమా తీసే అదృష్టం ఇప్పుడు అతని సొంతమైంది. గత రాత్రి ఓ సర్ ప్రైజ్ ఇస్తానని ప్రకటించిన నితిన్ ఇప్పుడు ఏకంగా అదేంటో ఫోటో ద్వారా చెప్పేశాడు.

నితిన్ తదుపరి చిత్రం నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ తోపాటు, స్వయనా పవన్ కళ్యాణ్ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నాడు. పవన్ బ్యానర్ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కూడా కో పార్ట్ నర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి స్క్రిప్ట్ త్రివిక్రమ్ అందిస్తుండగా, దర్శకుడు ఎవరన్నది ముందుగా కాస్త సస్పెన్స్ లో ఉంచారు. అయితే రౌఢీ పెల్లో దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్నాడని సమాచారం .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithin  Pawan kalyan  Trivikram  Kalyan Krishna  New Movie  Pawan kalyan Creative Works  

Other Articles