ధృవ వాయిదాపై అఫీషియల్ గా ప్రకటన? | Ram Charan Dhruva not postponed

Ram charan dhruva not postponed

Ram Charan, Dhruva Movie, Dhruva release date, Dhruva Postpone, Dhruva Movie release, no dialamma for Dhruva, Dhruva in December only

Ram Charan's Dhruva Movie Postponed just week only.

మెగా రూమర్లు నమ్మకండి

Posted: 11/16/2016 01:14 PM IST
Ram charan dhruva not postponed

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ధృవ సినిమా గురించి కొత్త రూమర్లు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. కరెన్సీ కష్టాల నేపథ్యంలో విడుదల చేసి రిస్క్ చేయటం ఇష్టం లేని నిర్మాత అల్లు అరవింద్ సినిమాను ఓ నెల పోస్ట్ పోన్ చేయాలని డిసైడ్ అయ్యాడని, సంక్రాంతికి రానున్న మెగా సినిమా ఖైదీ నంబర్ 150 ను ఇంకో నెల ముందుకు జరపాలని డిసైడ్ అయ్యారంటూ నిన్నంతా వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఈ నేఫథ్యంలో ధృవ విషయమై ఆ చిత్ర యూనిట్ స్పందించింది. ఏ విషయం అన్నది మరో రెండు రోజుల్లో చెబుతాం అంటూనే, ఎట్టి పరిస్థితుల్లో సినిమా వచ్చే నెలలోనే రిలీజ్ అవుతుందని తేల్చేసింది కూడా. అంటే డిసెంబర్ 2 లేదా మరో వారం ముందుకు జరపాలన్న ఆలోచనలో ఉన్నారంట.

అల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో కొత్త కరెన్సీ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవటం, చిల్లర కష్టాలు ఇంకా కొనసాగుతుండటంతో థియేటర్ల యాజమాన్యాలు సినిమాలను విడుదల చేసేందుకు ధైర్యం చేయటంలేదు. ఇప్పటికే రిలీజ్ అయిన సాహసం శ్వాసగా.. ఖాళీగానే రన్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొత్తగా విడుదలయ్యే సినిమాల రిజల్ట్ చూశాకే ధృవ గురించి ఓ అపీషియల్ ప్రకటన వెలువడనుందన్న మాట.

ఇదిలా ఉండగా రిలీజ్ వాయిదా లేదన్న ఖుషీలో ఉన్న ఫ్యాన్స్ కి మరో తీపి కబురు అందింది. నవంబర్ 18న యూఈఏలోని షార్జా క్రికెట్ స్టేడియంలో ఏషియా విజన్ అవార్డ్ ఫంక్షన్ జరగనుండగా.. ఈ కార్యక్రమానికి చెర్రీ హాజరవుతాడని తెలుస్తోంది. ఈ అవార్డులకు సంబంధించి.. టాలీవుడ్ నుంచి ఎంపికైన ఏకైక హీరో రామ్ చరణ్ కావటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Dhruva movie  release date  

Other Articles