సెక్స్ సీన్ పేరిట నిర్మాత రియల్ గా రేప్ చేశాడు | Rose McGowan claims she was raped

Rose mcgowan claims she was raped

Rose McGowan Rape experience, Rose McGowan interview, Rose McGowan hollywood executive, Rose McGowan hot, Rose McGowan intimate scene, Actress sexperience

Rose McGowan claims she was raped by a Hollywood executive.

ఆ హీరోయిన్ రేప్ అందరికీ తెలిసిందేనంట!

Posted: 10/15/2016 06:14 PM IST
Rose mcgowan claims she was raped

సినిమాల్లో బెడ్ సీన్లు ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయిన విషయం. అయితే ఆ వంకతో హీరోయిన్ పై నిజంగా దాష్టీకానికి పాల్పడితే ఎలా ఉంటుంది?. అవును... సినిమాలో సెక్స్ సీన్ పేరిట ఓ హీరోయిన్ ను లైంగిక దాడి చేశాడంట ఓ నిర్మాత. హాలీవుడ్ కి చెందిన రోజ్ మెక్ గోవాన్ చార్మ్ డ్, గ్రిండ్ హౌస్ లాంటి చిత్రాలతో బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె వయసు 42 ఏళ్లు. ప్రారంభంలో చిన్న చితకా వేషాలు వేసి, ఆపై హీరోయిన్ గా రెండు దశాబ్దాలకు పైగానే రాణిస్తోంది.

ఈ మధ్య ఆడాళ్లపై జరుగుతున్న అకృత్యాలను ఓపెన్ గా చెప్పేసుకోవటం అలవాటుగా మారిపోయింది. అందుకే తాను ఇప్పుడు ముందుకు వచ్చి జరిగింది వివరిస్తున్నానని ఆమె అంటోంది. తనకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓ స్టూడియో అధినేత తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. కథలో భాగంగా ఓ శృంగార సన్నివేశంలో పాల్గొనాలని నన్ను కోరారు. నటనే కదా నేను సిద్ధపడ్డా. అందుకోసం న్యూడ్ గా మారిపోయా. తీరా సీన్ ప్రారంభమయ్యే సమయానికి ఆ చిత్ర నిర్మాత నన్ను అసభ్యంగా తాకాడు. ఆపై బెడ్ మీద పడేసి నన్ను బలవంతం చేశాడు. నాతో ఆసహజ రీతిలో పనులను కానిచ్చాడు. అదంతా సినిమాగా తీశాడు కూడా అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చింది.

ఆ తర్వాత అతనిపై కేసు వేయాలని అనుకున్నాం. కానీ, సినిమా సెక్స్ సీన్ కోసం నేను ఓకే చెప్పినట్లు అంగీకార ఒప్పందం ఉండటంతో కేసు నిలువదని తన తరపు లాయర్ చెప్పటంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలిపింది. అయితే ఇంత చెప్పిన రోజ్ తనను ఎవరు రేప్ చేశారన్న విషయం మాత్రం బయటపెట్టలేదు. అమెరికా అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై లైంగిక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇలా పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే తమపై జరిగిన లైంగిక దాడులను షేర్ చేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rose McGowan  sexperience  Rape  

Other Articles