మెగా పవర్ స్టార్ డబుల్ బోనంజా ఏంటో? | Cherry Double treat for this dussera

Cherry double treat for this dussera

Cherry Double treat for this dussera, Cherry-Sukku movie starts, Mega Power star Double treat, Dussera Mega Power Star, ram charan new movie starts from dussera, Ram Charan Sukumar movie starts

Cherry Double treat for this dussera. Released Druva teaser and Sukumar Movie Starts.

దసరాకి చెర్రీ డబుల్ ట్రీట్ ఇస్తాడా?

Posted: 10/07/2016 11:07 AM IST
Cherry double treat for this dussera

మెగా పవర్ స్టార్ రాం చరణ్ అప్ కమింగ్ ప్రాజెక్టు ధ్రువ డిలే అవుతూ వస్తున్న విషయం తెలిసిందే. బ్రూస్ లీ దెబ్బకి ఏడాది నుంచి ప్రేక్షకులకు మొహం చూపించని చెర్రీ ఓ హిట్ రీమేక్ వస్తున్నాడని పెదవి విరిచినప్పటికీ, దాని ద్వారా హిట్ కొట్టి తీరతానన్న కసితో ఉన్నాడు. డిసెంబర్ లో 'ధ్రువ' విడుదలకి ముస్తాబవుతుండగా, ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ లతో ఆసక్తి క్రియేట్ చేశాడు. ఇక దసరాకి ఏకంగా టీజర్ ఫ్లాన్ చేశాడు కూడా.

ఇది ఇలా ఉండగానే తన తదుపరి సినిమాకి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడని సమాచారం. సుకుమార్ డైరక్షన్ లో చెర్రీ తదుపరి సినిమా వుంటుందనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను సుకుమార్ పూర్తి చేశాడు. విజయదశమి తిరుగులేని ముహూర్తం కావడంతో, ఆ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారట. అలా ఆ రోజున ఈ సినిమా షూటింగును ప్రారంభించి, నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాలో చరణ్ పక్కా పల్లెటూరి బుల్లోడుగా కనిపించనున్నాడు. అంతేకాదు ఈ సినిమా కోసం చెర్రీ డిఫరెంట్ లుక్ లోకి మారిపోనున్నాడు. ముందుగా ఫారిన్ లోనే షూటింగ్ అని చెప్పినప్పటికీ, ఆపై పూర్తిగా గ్రామీణ వాతావరణంలోనే తెరకెక్కిస్తున్నట్లు సుక్కూ ప్రకటించడం విశేషం. సాధారణంగా సినిమాతో కన్ఫ్యూజ్ చేసే ఈ లెక్కల మాస్టారూ అల్రెడీ ఫార్ములా ఎక్స్ అనే టైటిల్ నే ఆ పని మొదలుపెట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Sukumar  Movie  Dussera  Dhruva Teaser  

Other Articles