ధోనీ సెంచరీకి చేరువయ్యాడోచ్ | MS Dhoni The Untold Story inching closer to 100 crores.

Ms dhoni the untold story inching closer to 100 crores

MS Dhoni The Untold Story collections, MS Dhoni The Untold Story reached to 100 crores, MS Dhoni The Untold Story inching closer, Taran Adarsh on Dhoni Movie Collections

MS Dhoni The Untold Story inching closer to 100 crores.

ధనాధన్ కుర్రాడు సెంచరీకి చేరువయ్యాడు

Posted: 10/06/2016 06:16 PM IST
Ms dhoni the untold story inching closer to 100 crores

ఏఐట్రిపుల్ ఈ లో 7వ ర్యాంకు సాధించాడు. కానీ, యాక్టింగ్ పై ఇంట్రస్ట్ తో ఇంజనీరింగ్ విద్యను వదిలేసి కష్టపడ్డాడు. ఎటువంటి అంచనాలు లేని అతని నుంచి బాలీవుడ్ ఇంతదాకా ఏం ఆశించలేదు. కానీ, ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా అతని జీవితాన్ని మార్చేసింది. పరకాయ ప్రవేశం చేసి తీసి ధోనీ సినిమాతో అతని దశ తిరిగింది. విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాదు, కెరీర్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడంటూ అతనిపై అభినందనలు కురుస్తున్నాయి.

కెరీర్ లో ఇప్పటిదాకా అరడజను చిత్రాల దాకా చేశాడు. కానీ, ఒక్కటి కూడా అతనికి ఉపయోగపడలేదు. కానీ, ధోనీ హెలికాప్టర్ షాట్ మాత్రం అతన్ని అమాంతం పైకి తీసుకెళ్లింది. సరిగ్గా పిండుకున్న దర్శకుడు నీరజ్ పాండే ధోనీ డూప్లికేట్ ను తెరపై చూపించేశాడు. నడక నుంచి ప్రతీ దాంట్లో ధోనిని అనుకరించిన విధానం అందరినీ, ముఖ్యంగా మహి అభిమానులను ఆకర్షిస్తుంది.

ఇక వీకెండ్ లో 66 కోట్లకు పైగా సాధించి షారూఖ్ ఫ్యాన్ ను వెనక్కి నెట్టేసి మరీ ఈ యేడాది సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్ (మొదటి స్థానంలో సుల్తాన్) నిలిచాడు ధోనీ. మూవీ ట్రేడ్ అనాలసిస్ట్ తరుణ్ ఆదర్శ్ లెక్కల ప్రకారం ధోనీ ఐదు రోజుల్లో 82 కోట్లు కలెక్ట్ చేశాడు. గురువారం మరో 7 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ వారం మీర్జాయ్ వస్తోంది. థియేటర్లు తగ్గినప్పటికీ ఫుల్ రన్ లో మాత్రం వందకోట్లు సాధించడం మాత్రం ఖాయమైపోయింది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni The Untold Story  collections  100 crores  

Other Articles