సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు సెలబ్రిటీల సీరియల్ గా విడాకులు తీసేసుకుంటున్నారు. మొన్న అమలాపాల్, నిన్న సీనియర్ నటి లిజి, దర్శకుడు ప్రియదర్శన్ దంపతులు వేరుకాగా, తాజాగా ఏకంగా సూపర్ స్టార్ కూతురు విడాకులకు సిద్ధమైపోతుంది. రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ తన భర్త అశ్విన్ నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటుందుని నిన్నటి నుంచి వార్తల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. దీంతో ఆమె నేరుగా స్పందించారు.
అవును నా విడాకుల విషయం నిజమేనంటూ ఏకంగా ట్విట్టర్ లో ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసేసింది. ఏడాది కాలంగా తాను, తన భర్త అశ్విన్ విడివిడిగా ఉంటున్నామని, తమ మధ్య విడాకుల విషయమై చర్చ కూడా నడుస్తుందని ఆమె తెలిపింది. అయితే విడాకులకు సరైన కారణం వివరించని ఆమె ఇది తమ కుటుంబ వ్యవహారమని, దీనిపై మీడియా ఊహగాన కథనాలు, జోక్యం అవసరం లేదని చెప్పుకోచ్చింది.
కాగా, రజనీకాంత్ కు ఇద్దరు కుమార్తెలు కాగా, ఐశ్వర్య హీరో ధనుష్ ని పెళ్లి చేసుకోగా, మరో కూతురు సౌందర్యరజనీకాంత్‌కు 2010లో వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌తో వివాహం జరిగింది. వారికి ఇటీవలే ఇక బిడ్డ కూడా కలిగాడు. మనస్పర్థల కారణంగానే ఆమె ఏడాదిగా భర్తకు దూరంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం కిడ్నీ సంబంధిత వ్యాధికి ట్రీట్ మెంట్ కోసం యూఎస్ వెళ్లిన అశ్విన్ తిరిగి రాగానే విడాకుల వ్యవహారం ఓ కొలిక్కివచ్చే అవకాశం ఉంది.
ఇక గ్రాఫిక్స్ టెక్నాలజిలో నిపుణురాలైన సౌందర్య గోవా చిత్రం ద్వారా నిర్మాతగానూ, తన తండ్రి హీరోగా నటించిన యానిమేషన్ చిత్రం కోచ్చడైయాన్ చిత్రంతో దర్శకురాలుగా చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యింది. తాజాగా ధనుష్ హీరోగా సౌందర్య ఒక చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
News about my marriage is true. We have been separated for over a year & divorce talks are on. I request all to respect my family's privacy.
— soundarya rajnikanth (@soundaryaarajni) September 16, 2016
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more