ఓ స్టార్ హీరో సినిమా ఫట్ అంటే చాలూ మరో స్టార్ హీరోలు రోడ్డెక్కి సంబరాలు చేసుకోవటం, సోషల్ మీడియాలో పంచ్, కామెంట్లు టైంపాస్ చేయటంతో సరిపెట్టుకున్న అభిమానులు ఏకంగా చంపుకునేంత పరిస్థితి రావటం దారుణం. దీనికి వెనుక వెర్రితలలు వేసిన అభిమానం ఒక్కటే కాదు. ఆయా హీరోలు చేష్టలూడిగి చూడటం కూడా ఓ కారణం అవుతుంది. అభిమానులే దేవుళ్లు, మీరు లేకపోతే మేం లేం అని మైకుల్లో బిగ్గరగా చెప్పుకుని రెచ్చగొట్టి మరీ విజిల్స్ వేయించుకునే హీరోలు, ఫ్యాన్స్ తో ఇతరు హీరోలను, వారి అభిమానులను స్నేహపూర్వకంగా ఇంతవరకు ఎవరైనా చెప్పారా ? పోనీ అలాంటి ప్రయత్నం మచ్చుకైనా ఎవరైనా చేశారా? అంటే సమాధానం దొరకటం కష్టం. ఆ సంగతి పక్కనబెడితే పవన్ అభిమాని వినోద్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్లను పరిశీలిద్దాం.
తమ కాలంలో కూడా అభిమానులు - అభిమాన సంఘాలూ ఉండేవని, కానీ ఇలాంటి దారుణమైన ఘటనలు ఎప్పుడూ జరగలేదని అన్నారు. దాసరి నారాయణ రావు లాంటి వంటి పెద్దవాళ్లు చెబితే వినే పరిస్థితి ప్రస్తుత కాలంలో హీరోలు లేరని ఇప్పుడంతా "చెట్టు పేరు చెప్పుకొని తిరిగే హీరోలు ఎక్కువగా ఉన్నారని" తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాట వరుసకు గొడవలు పడొద్దు అని అప్పుడప్పుడూ స్టేజీలపైకి ఎక్కి చెప్పినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ హీరోలంతా ముందుకువచ్చి ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
అభిమానులు ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి హీరోల మధ్య కూడా ద్వేషాలు పెరగటానికి ఇప్పటి సినిమాల్లో వచ్చే పిచ్చి పిచ్చి డైలాగులు కూడా కారణమని భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. నేటి హీరోలంతా బాగా చదువుకున్నవాళ్లేనని అటువంటి పిచ్చి పిచ్చి డైలాగుల పర్యవసానాలు ఎలా ఉంటాయన్న విషయం వారంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. ఇటువంటి దారుణమైన పరిస్థితులపై తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని తమ్మారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తన అభిమాన హీరోలకు సంబందించి ఎవరు గొప్ప అనే విషయలపై డిస్కషన్స్ రావడం, అది ఏకంగా కత్తులతో దాడిచేసుకునే స్థాయికి చేరడం వంటి ధారుణమైన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్రహీరోలు ఏదో ఒకటి చేయాలని ఆయన కోరారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more