జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్యా ప్రయత్నంతో విశాల్ కి చిక్కులు | vishal behind junior artist arasu suicide attempt

Vishal behind junior artist arasu suicide attempt

Junior Artist Arasu commits suicide, Vishal on junior artist suicide letter, junior artist letter to vishal before suicide, General Secretary of the Nadigar Sangam

Due to Financial reasons Kollywood Junior Artist Arasu commits suicide. Before that he writes a letter to Hero Vishal.

విశాల్ మెడకు మరో వివాదం

Posted: 08/25/2016 01:13 PM IST
Vishal behind junior artist arasu suicide attempt

హీరో విశాల్ మెడకు మరో వివాదం చుట్టుకుంది. ఈ మధ్యే నిర్మాతల మండలి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విశాల్ కి, ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ ఒకరు సూసైడ్ ప్రయత్నం చేయటం చిక్కుల్లో పడవేసింది. 29 ఏళ్ల ఇళవరసన్(అరసు) 40 కి పైగా సినిమాల్లో సపోర్టింగ్ నటుడిగా అలరించాడు. అయితే నిర్మాతల దగ్గరి నుంచి అతనికి రావాల్సిన రెమ్యునరేషన్ మాత్రం ఇంత వరకు అందలేదంట. ఈ విషయమై తరచూ భార్యతో గొడవ కూడా జరిగేది. చివరికి అతని నుంచి వేరుగా ఉంటున్న ఆమె విడాకుల నోటీసు కూడా పంపింది.

దీంతో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తనను ఎలాగైనా ఆదుకోవాలని హీరో, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ కి ఓ లేఖ రాశాడు. ఎలాగైనా నిర్మాతలతో మాట్లాడి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అందులో విశాల్ ని కోరాడు. అయితే విశాల్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో జీవితం మీద విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. నోటి నుంచి నురగలు రావటం గమనించిన బంధువొకరు ఆస్పత్రిలో చేర్పించగా, ప్రస్తుతం  చికిత్స అందిస్తున్నారు.

కాగా, నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో విశాల్ టీం విఫలం అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమ ఇబ్బందులను అస్సలు పట్టించుకోవటం లేదని జూనియర్ ఆర్టిస్ట్ సంఘం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో విశాల్ విమర్శలను ఎలా ఎదుర్కుంటాడా? అని సౌత్ సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior Artist Arasu  Nadigar Sangam  Vishal  letter  

Other Articles