కోట్ల యాడ్ ను వదులుకున్న ప్రభాస్ | Baahubali Prabhas was offered to endorse a fitness brand

Baahubali prabhas was offered to endorse a fitness brand

Baahubali Prabhas, Prabhas fitness ad, Crores for Baahubali Prabhas Ad, Prabhas Ad, Prabhas says no for that Ad, Money is not important for prabhas

Baahubali Prabhas was offered to endorse a fitness brand with whoopy amount but says sorry.

డబ్బే ముఖ్యం కాదంటున్న ప్రభాస్

Posted: 08/19/2016 11:55 AM IST
Baahubali prabhas was offered to endorse a fitness brand

బాహుబలి తర్వాత ప్రభాస్ అనే పేరు న్యూస్ గా మారిపోయింది. నేషనల్ , ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రభాస్ పేరు మారుమోగి పోవటమే కాదు, హాలీవుడ్ మాగ్జైన్ లలో సైతం యంగ్ రెబల్ స్టార్ మీద ఆర్టికల్స్ వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీకి వచ్చిన పదేళ్ల తర్వాత గుర్తింపు లభించడం మాట అటుంచి, నాలుగేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలమే పొందాడు.

ఇక ప్రభాస్ బాహుబలి క్రేజ్ ను ఉపయోగించుకునేందుకు బ్రాండ్ లు సైతం ఎగబడుతున్నాయి. ఆ మధ్య రాజమౌళి ఒత్తిడి మేరకు మహీంద్రా యాడ్ లో మెరిసిన ప్రభాస్ కి ఇఫ్పుడు మరో బంఫరాఫర్ దొరికింది. ఓ సినిమా కోసం రోజుకు 16 గంటలు కష్టపడే ప్రభాస్ ను ఓ ఫిట్ నెస్ సంస్థ తమ బ్రాండ్ కోసం ఓ యాడ్ లో నటించాల్సిందిగా కోరిందట. ఇందుకోసం అతగాడికి ఏకంగా 5.5 కోట్లు ముట్టజెప్పడానికి సిద్ధమయ్యిందట. అయితే తనకు డబ్బు ముఖ్యం కాదంటూ ప్రభాస్ సింపుల్ గా ఆ ఆఫర్ ను తిరస్కరించాడని తెలుస్తోంది.

చిన్న హిట్ పడితే చాలూ అడ్డగొలుగా సంపాదన వెనుకేసుకునే స్టార్ లు ఉన్న ఈ రోజుల్లో... హర్డ్ వర్క్ తో పైకొచ్చిన ప్రభాస్ ఈ నిర్ణయంతో మరో మెట్టుపైకి ఎక్కాడనే చెప్పొచ్చు. ప్రస్తుతం తన దృష్టంతా సీక్వెల్ పైనే పెట్టిన ప్రభాస్ త్వరలో కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టేందుకు రెడీ అయిపోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  prabhas  fitness brand  Ad  refuse  

Other Articles