విశాల్ కత్తి సందాయ్ తెలుగులో ఒక్కడొచ్చాడు ఫస్ట్ లుక్ విడుదల | Vishal Katti Sandai aka Okadochadu first look out

Vishal katti sandai aka okadochadu first look out

Vishal Katti Sandai, Vishal with two girls, Vishal Katti Sandai first look, Vishal with tamanna and parota soori, Vishal Okkadochadu

Vishal Katti Sandai aka Okkadochadu first look out.

విశాల్ ను వాటేసుకున్న ఆ ఇద్దరు ఎవరు?

Posted: 08/12/2016 04:37 PM IST
Vishal katti sandai aka okadochadu first look out

8 వరుస ఫ్లాపుల తర్వాత అంబాల(తెలుగులో మగమహరాజు) మొదలైన విశాల్ హిట్ల పర్వం పాయుమ్ పులి(జయసూర్య), కథాకళి, మురుదు(రాయుడు)తో హిట్లు అందుకోవటమే కాదు, తెలుగులోనూ మళ్లీ మార్కెట్ ను పుంజుకునేలా చేసింది. ఇదే ఊపులో ఇప్పుడు ‘కత్తి సందాయ్’(ఒక్కోడొచ్చాడు) గా రాబోతున్నాడు.  సురాజ్ దర్శకత్వం వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను హీరో విశాల్ ఇటీవల విడుదల చేశాడు.

అయితే, ఆ ఫస్ట్ లుక్ లో భరతనాట్యం దుస్తుల్లో ఉన్న ఇద్దరు మహిళల మధ్య టక్ చేసిన ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. ఆ మధ్యలో ఉన్న వ్యక్తి హీరో విశాల్ అని అభిమానులు గెస్ చేయగలిగినా, మిగిలిన ఇద్దరు అమ్మాయిలు ఎవరనేది సస్పెన్స్ క్రియేట్ చేసింది. ఈ నెల 12వ తేదీన అంటే ఈ రోజున ఆ సస్పెన్స్ కు తెరతీస్తానని హీరో విశాల్ గతంలో చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే ముగ్గురూ కనిపించే విధంగా మరో ఫొటోను ఈ రోజు విడుదల చేశాడు.

ఈ నల్లనయ్యకు రెండు వైపులా నిల్చుని ఉన్న ఆ ఇద్దరు ఎవరంటే, ఒకరు మిల్కీ బ్యూటీ తమన్నా కాగా, మరొకరు కమెడియన్ పరోటా సూరి. సంతానం హీరోగా బిజీ అయిపోవటంతో సూరి ఇప్పుడు ఆ లోటును బాగా పూడుస్తున్నాడు. ఈ అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలకపాత్ర పోషిస్తుండగా, చాలా గ్యాప్ తర్వాత సీనియర్ కమెడియన్ వడివేలు అలరించబోతున్నాడు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishal  Katti Sandai  okkadochadu  first look  

Other Articles