నిమ్మగడ్డ దెబ్బకు మాటీవీ లైసెన్స్ లు రద్దు | MAA Network licence cancelled by Centre

Maa network licence cancelled by centre

Centre Cancels Maa TV Licences, MAA Network licence cancelled, MAA Network licence, MAA nimmagadda, Nimmagadda effect on MAA

MAA Network licence cancelled by nformation and Broadcasting.

షాక్ : మాటీవీ లైసెన్స్ లు రద్దు!

Posted: 08/12/2016 06:33 PM IST
Maa network licence cancelled by centre

మా టీవీ యజమాన్యానికి కేంద్రం పెద్ద షాకిచ్చింది. ఆ చానెల్ నెట్‌వర్క్ లైసెన్స్ రెన్యువల్స్‌ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ నిరాకరించింది. తాజాగా రెన్యువల్ చేసిన చానెళ్ల లిస్ట్ నుంచి మా టీవీ, మాగోల్డ్, మా మూవీస్, మా మ్యూజిక్ లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లైసెన్స్‌లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మా సంస్థ డైరెక్టర్‌ గా ఉన్న నిమ్మగడ్డ సత్యనారాయణపై ఆర్థిక నేరాల అభియోగాల కారణంతో క్లియరెన్స్‌ను హోంశాఖ సెక్యూరిటీ నిరాకరించింది. ప్రసారమంత్రిత్వ శాఖ అప్‌ లింకింగ్‌, డౌన్‌ లింకింగ్ నిబంధనలకు అనుగుణంగా కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే మా టీవీ చానెల్స్‌ను స్టార్‌గ్రూప్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

కానీ, ఇంకా లైసెన్స్ లిస్ట్ లో యాజమాన్యంగా పాత యాజమాన్యమే కొనసాగుతుంది. ఇక ఇప్పుడు తాజా కేంద్ర నిర్ణయంతో లైసెన్స్‌లను స్టార్ గ్రూప్ మా నెట్ వర్క్ చానెళ్లను తమ పేరిట మార్చుకుని, రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అప్పుడు కూడా ఏమైనా అభ్యంతరాలు తలెత్తితే మాత్రం ఇక అంతే. మొత్తం 892 ప్రైవేట్ చానెళ్లలో సమాచార ప్రసారాల శాఖ ఇప్పటిదాకా రద్దు చేసినవాట్లో 73 చానెళ్లతోపాటు, 24 ఎఫ్ ఎం చానెళ్లు, 9 పత్రికలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MAA Network  licence  cancelled  

Other Articles