చికాగోలో కోరిక తీర్చుకున్న రాశిఖన్నా | Rashi Khanna Sky Diving in Chicago Sharing video in twitter

Rashi khanna sky diving in chicago sharing video in twitter

Rashi khanna Adventure in Chicago, Rashi khanna Dream Came true, rashi Khanna Sky Diving

Actress Rashi Khanna Sky Diving in Chicago Sharing video in twitter.

చికాగోలో కోరిక తీర్చుకున్న రాశిఖన్నా

Posted: 07/05/2016 06:01 PM IST
Rashi khanna sky diving in chicago sharing video in twitter

కేవలం అందంతోనే నెట్టుకొస్తుంది తప్ప మరేం మ్యాటర్ లేదు అన్న విమర్శలను సుప్రీంలో బెల్లం శ్రీదేవీగా తన కామెడీ టైమింగ్ యాక్టింగ్ తో చెరిపి పడేసింది ముద్దుగుమ్మ రాశిఖన్నా. ఆ చిత్రం ఇచ్చిన సక్సెస్ బూస్ట్ లో ఇప్పుడు మరో రెండు చిత్రాలకు సిద్ధమైపోతుంది. గోపిచంద్ ఆక్సిజన్ లో తన పార్ట్ షూటింగ్ కోసం ఇంకా టైం ఉండటం, రవితేజ రాబిన్ హుడ్ చిత్రం మొదలుకాకపోవటంతో ఈ గ్యాప్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం తానా వేడుకల్లో బిజీబిజీగా గడిపేస్తోంది.

అయితే ఈ ట్రిప్ లోనే తన చిరకాల కోరిక తీర్చేసుకోవాలని డిసైడ్ అయిపోయిందట రాశి. ఎప్పటి నుంచో తనకు ఎత్తైన ప్రదేశాల నుంచి దూకాలని ఉందట. కానీ, అందుకు ఎప్పుడు వీలుకాలేదని చెబుతుంది. కానీ, చికాగోలో ఉన్న ఈ సుందరి ఇప్పుడు ఆ కోరికను తీర్చేసుకుంది. ఏకంగా 14వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసేసింది. అంతే కాదు ఆ వీడియోను నెట్ లో పోస్ట్ చేసి.. తన సాహసాన్ని అభిమానులకు కళ్లారా చూపించింది.

 

'పొట్టలో సీతాకోక చిలకలు తిరిగిన క్షణం అది. స్కైడైవింగ్ ను ఎంజాయ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. నేను అనుకున్నదానికంటే ఎక్కువ థ్రిల్లింగ్ గా హ్యాపీగా ఉంది.' అంటూ ఆ సాహసం గురించి రాశి ఖన్నా ట్వీటింది. అయితే సింగిల్ గా కాదులేండి ఓ డైవర్ సాయం తీసుకుని మరీ దూకేసింది. జింగ్... జింగ్... అమేజింగ్... రాశిఖన్నా ఎంత డేర్ అండ్ డాషింగో కదా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashi khanna  Chicago  ATA 2016  Sky Diving  robin hood  Oxygen  

Other Articles