దిల్ రాజు, త్రివిక్రమ్ ల సినిమాకు హీరో ఫిక్స్? | Hero Fixed for Dil Raju Trivikram Film

Hero fixed for dil raju trivikram film

Hero Fixed for Dil Raju Trivikram Film, Trivikram with Dil Raju, Trivikram movie with Dil Raju, Dil Raju movie with Trivikram, Dil Raju movies, Dil Raju next with Trivikram, Dil Raju

Hero Fixed for Dil Raju Trivikram Film: tollywood top director Trivikram srinivas next film with Dil Raju under Sri Venkateshwara Creations Banner.

దిల్ రాజు, త్రివిక్రమ్ ల సినిమాకు హీరో ఫిక్స్?

Posted: 06/08/2016 11:09 AM IST
Hero fixed for dil raju trivikram film

‘అఆ’ సినిమాతో మరోసారి సక్సెస్ ను సొంతం చేసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే తర్వాత సినిమా ఏంటో ఇంకా తెలియదు. కానీ ‘అఆ’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాత్రం తన బ్యానర్లో త్రివిక్రమ్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నానని, ఇందులో ఓ స్టార్ హీరో నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.

దిల్ రాజు, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో రూపొందబోయే సినిమాలో నటించే ఆ స్టార్ ఎవరూ అని సినీవర్గాలు తెగ చర్చించుకుంటున్నారు. కానీ ఈ కాంబినేషన్లో నటించబోయే ఆ స్టార్ హీరోను ఖరారు చేసారు. అతనే మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ. సినీవర్గాల తాజా సమాచారం ప్రకారం... త్రివిక్రమ్, దిల్ రాజు కాంబినేషన్లో రూపొందనున్న తాజా చిత్రంలో రాంచరణ్ హీరోగా నటించనున్నట్లుగా తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలను మరికొద్ది రోజుల్లోనే దిల్ రాజు అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్ర్కిప్ట్ వర్క్ మొదలయ్యిందని తెలుస్తోంది. అలాగే ‘ధృవ’ షూటింగ్ లో రాంచరణ్ బిజీగా వున్నాడు. సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dil Raju  Trivikram  Ram Charan  A Aa Movie  Pawan Kalyan  

Other Articles