ఫస్ట్ లుక్ విడుదల: రంగంలోకి దిగిన ‘మొహెంజోదారో’ | Mohenjo Daro First Look Poster

Mohenjo daro first look poster

Mohenjo Daro First Look Poster, Mohenjo Daro Motion Poster, Hrithik Roshan Mohenjo Daro, Pooja Hegde Mohenjo Daro, Mohenjo Daro movie news, Mohenjo Daro movie updates, Hrithik Roshan movies, Hrithik Roshan stills, Pooja Hegde latest stills, Pooja Hegde hot stills

Mohenjo Daro First Look Poster: Starring Hrithik Roshan and Pooja Hegde. A film by Ashutosh Gowariker. Watch now the motion poster of Mohenjo Daro.

ఫస్ట్ లుక్ విడుదల: రంగంలోకి దిగిన ‘మొహెంజోదారో’

Posted: 06/08/2016 10:23 AM IST
Mohenjo daro first look poster

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మొహెంజోదారో’. పూజా హెగ్డే హీరోయిన్. అశుతోష్ గౌరీకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూటివి మోషన్ పిక్చర్స్, అశుతోష్ గౌరీఖర్ ప్రొడక్షన్స్ ప్రై.లి. బ్యానర్లపై నిర్మాతలు సిద్ధార్థ్ రాయ్ కపూర్, సునీత గౌరీకర్, అశుతోష్ గౌరీకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నిన్న‘మొహెంజోదారో’ మోషన్ పోస్టర్ ను విడుదల చేసినప్పటికీ అంతగా రెస్పాన్స్ బాగా రాకపోవడంతో తాజాగా హృతిక్ రోషన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో హృతిక్ చాలా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇపుడు ఇలా ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేస్తూ మరింతగా పెంచేస్తున్నారు చిత్ర యూనిట్.

హృతిక్ రోషన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. మరికొద్ది రోజుల్లో పూజా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను జులై రెండవ వారంలో విడుదల చేసి, సినిమాను ఆగష్టు 12న విడుదల చేయనున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohenjo Daro  Hrithik Roshan  Pooja Hegde  

Other Articles