రెహమాన్ ఖాతాలో జపాన్ గ్రాండ్ ప్రైజ్ | AR Rahman Receives Japan Fukuoka Prize

Ar rahman receives japan fukuoka prize

AR Rahman Receives Japan Fukuoka Prize, AR Rahman Receives Fukuoka Prize, AR Rahman Fukuoka Prize, AR Rahman latest updates, AR Rahman prizes, AR Rahman stills

AR Rahman Receives Japan Fukuoka Prize: A R Rahman, Grand Fukuoka Prize 2016, Grand Fukuoka Prize 2016. A.R. Rahman has been named as grand prize winner of the prestigious Fukuoka Prize.

రెహమాన్ ఖాతాలో జపాన్ గ్రాండ్ ప్రైజ్

Posted: 06/02/2016 12:39 PM IST
Ar rahman receives japan fukuoka prize

ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరును సంపాదించుకున్న ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చిన్న సినిమాలకు కూడా తన సంగీతంతో భారీ స్థాయికి తీసుకెళ్లే సామర్థ్యం వున్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఇప్పటికే రెహమాన్ కు ఎన్నో అవార్డులు, రివార్డులు, పురస్కారాలు దక్కాయి. తాజాగా అతని ఖాతాలోకి మరో అవార్డు వచ్చి చేరింది.

జపాన్ ప్రభుత్వం అందించే గ్రాండ్ ఫ్యూకూవోకా అవార్డు రెహమాన్‌ని వరించింది. తన సంగీతం ద్వారా ఆసియా దేశాల సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పినందుకు రెహమాన్‌ని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డును అందుకున్న భారతీయులలో సితార్ విద్వాంసులు పండిట్ రవిశంకర్, నర్తకి పద్మా సుబ్రహ్మణ్యం, సరోద్ విద్వాంసులు అంజాద్ అలీఖాన్ తదితరులు వున్నారు.

ఫ్యూకూవోకా అవార్డులు మూడు విభాగాలుగా వుంటాయి. మొదటిది గ్రాండ్ ప్రైజ్, రెండవది అకాడమిక్ ప్రైజ్, మూడవది కల్చర్ ప్రైజ్. తాజాగా రెహమాన్ కు గ్రాండ్ ప్రైజ్ సొంతమయ్యింది. ఈ అవార్డు వరించడం పట్ల రెహమాన్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AR Rahman  Fukuoka Prize  Awards  

Other Articles