సుప్రీమ్ కు షాక్ ఇచ్చిన భామ | Sai Dharam Tej shocks with lady dance

Sai dharam tej shocks with lady dance

Sai Dharam Tej shocks with lady dance, Sai Dharam Tej in KTUC, Sai Dharam Tej movies, Sai Dharam Tej interviews, Sai Dharam Tej latest stills, Sai Dharam Tej movie updates, Supreme collections, Supreme movie updates, Supreme stills

Sai Dharam Tej shocks with lady dance: Sai Dharam Tej recent blockbuster hit film supreme. anil ravipudi direction.

సుప్రీమ్ కు షాక్ ఇచ్చిన భామ

Posted: 05/16/2016 12:52 PM IST
Sai dharam tej shocks with lady dance

మెగా మేనల్లుడుగా సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో సాయిధరమ్ తేజ్. పర్ఫెక్ట్ కథలతో వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. తాజాగా సాయిధరమ్ తేజ(తేజు) నటించిన ‘సుప్రీమ్’ సినిమా విడుదలై, మంచి విజయం సాధించింది. అన్నిచోట్ల కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

డాన్సులు, యాక్టింగ్, యాక్షన్ సన్నివేశాలలో తేజు ఇరగదీస్తాడనే పాజిటివ్ టాక్ వుంది. అలాంటి తేజుకు ఓ రష్యన్ అమ్మాయి చుక్కలు చూపించేసింది. రష్యన్ భామ తన డాన్సుతో తేజుకు షాక్ ఇచ్చింది. ఇటీవలే ఓ కార్యక్రమంలో తేజు పాల్గొన్నాడు. అక్కడ ఓ రష్యన్ భామతో సరదాగా ఓ ఫన్నీ స్కిట్ చేయించారు. ఆ తర్వాత ఆ అమ్మడి ‘సర్దార్ గబ్బర్ సింగ్’లోని ‘తోబ తోబ..’ పాటకు డాన్స్ చేస్తుంటే పక్కనే వున్న తేజు షాక్ కు గురయ్యాడు.

ఆ అమ్మడికి తెలుగు అర్థం కాకపోయిన.. అందులోని బీట్ కు తగ్గట్లుగా డాన్స్ చేస్తుంటే.. ‘వామ్మో.. ఇవిడేంది.. ఇలా డాన్స్ ఇరగదీస్తోంది’ అనే విధంగా తేజు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. ఇక చివర్లో ఆ అమ్మడితో కాస్త చిందులు కూడా వేసి, అభినందించి పంపించేసారు. మొత్తానికి రష్యన్ భామ డాన్స్ కు తేజు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఇక ‘సుప్రీమ్’ తర్వాత తేజు హీరోగా ‘తిక్క’ అనే చిత్రం మరియు దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్నాయి. త్వరలోనే ‘తిక్క’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Sandy

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme  Sai Dharam Tej  Rashi khanna  

Other Articles