పవన్ కళ్యాణ్ కొత్త సినిమా స్టోరీ లీక్.. ? ఫ్యాన్స్ ఖుషి! | pawan kalyan latest cinema story leaked

Pawan kalyan latest cinema story leaked

pawan kalyan, Power Star, SJ Surya, Pawan Latest Cinema, సూర్య, పవన్ కళ్యాణ్, పవన్, పవన్ స్టోరీ లీక్

Power Star Pawan kalyan latest cinema with Director SJ Surya story leaked. As per that source Pawan will play as factionist and lover in this cinema.

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా స్టోరీ లీక్.. ? ఫ్యాన్స్ ఖుషి!

Posted: 04/29/2016 09:50 AM IST
Pawan kalyan latest cinema story leaked

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో అభిమానులను అలరించాడు. ఇక ఆ సినిమా తర్వాత వెంటనే తనకు కెరీర్ హిట్ అందించిన ఖుషి సినిమా డైరెక్టర్ ఎస్. జె సూర్యతో కలిసి ఓ సినిమాకు ఓకే కూడా చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ టైంలోనే సూర్య కథతో పవన్ దగ్గరకు వెళ్లాడట. అయితే మొత్తానికి పవన్ ను ఒప్పించిన సూర్య.. ఆయనతో సినిమాకు రెడీ అయ్యాడు. తాజాగా ఆ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే అంతలోనే ఓ వార్త టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. అదే స్టోరీ లీక్.

Also Read: సెటిల్మెంట్ చేసిన పవన్ కళ్యాణ్

పవన్ తాజా చిత్రం కూడా గతంలో వచ్చిన అత్తారింటికి దారేది తరహాలో లీక్ ల బెడద నుండి తప్పించుకోలేకపోతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో అత్తారింటికి దారేది సినిమా లీకేజ్ తో ఏకంగా సినిమా రిలీజ్ ఆపివెయ్యాలా అనే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు తాజాగా సెట్స్ మీదకు వెళ్లకు ముందే సినిమా స్టోరీ లీక్ అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. పవన్ ఈ సినిమాలో ఫ్యాక్షనిస్టుగా, ప్రేమికుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. మొత్తంగా ఫ్యాక్షన్ బ్రాగౌండ్ లో సాగే ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. అయితే ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్లని సినిమా స్టోరీ ఎలా లీకవుతుందని కొంత మంది భావిస్తున్నారు. కాగా ఫ్యాన్స్ మాత్రం ఖుషీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాకు సంబందించిన ఏ చిన్న విషయం లీకైనా అది బ్లాక్ బస్టరే అంటున్నారు. మరి చూడాలి ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో లేదో..

Also Read: సైలెంట్ గా షురూ చేసిన పవన్ కళ్యాణ్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles