సెటిల్మెంట్ చేసిన పవన్ కళ్యాణ్ | Pawan kalyan settlement balance amount

Pawan kalyan settlement balance amount

Pawan kalyan gives money to sardaar cast, Sardaar Gabbar Singh Collections, Pawan Kalyan helps to cast, Pawan Kalyan settlement, Pawan Kalyan balance money, Pawan Kalyan latest news, Pawan Kalyan upcoming films, Pawan Kalyan stills, Pawan Kalyan movie news, Pawan Kalyan

Pawan kalyan settlement balance amount: Powerstar pawan kalyan latest film Sardaar Gabbar Singh. Bobby director. Sharath marar and sunil lulla producers.

సెటిల్మెంట్ చేసిన పవన్ కళ్యాణ్

Posted: 04/26/2016 03:42 PM IST
Pawan kalyan settlement balance amount

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలను సొంతం చేసుకుంది. కానీ సినిమా విడుదలయ్యాక.. ఆ అంచనాలను అందుకోలేకపోయింది. బాబీ దర్శకత్వంలో నిర్మాత శరత్ మరార్, సునీల్ లుల్లా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషలలో గ్రాండ్ గా, అత్యధిక థియేటర్లలో విడుదల చేసారు.

అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ అంచనాలతో సినిమాకు వెళ్లారు.. కానీ అనుకున్న స్థాయిలో సినిమా లేకపోవడంతో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తొలి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో కేవలం రెండు రోజుల్లోనే కొన్ని కొన్ని థియేటర్ల నుంచి సినిమాను తీసేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ సినిమా కలెక్షన్ల మోత మోగిస్తుందని భావించి తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు నిరాశే మిగిలింది. ఇదిలా వుంటే సినిమా కోసం పనిచేసిన సాంకేతికనిపుణులు తమకు రావలసిన మిగతా అమౌంట్ విషయంపై ఆశలు వదులుకున్నారు.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయాన్ని వదిలేయకుండా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఇవ్వవలసిన బ్యాలెన్స్ అమౌంట్ ను ఇచ్చి పవన్ సెటిల్ చేసారు. దీంతో పవన్ కళ్యాణ్ మంచితనానికి, నిజాయితీకి సాటి ఎవరూ రారు, లేరు అనిపించే విధంగా వారి ఆనందానికి అవుధులు లేకుండా పోయాయి. మరోసారి పవర్ స్టార్ తన క్యారెక్టర్ ఎంటో నిరూపించుకున్నాడు. ఇక డిస్ట్రిబ్యూటర్లకు తన తర్వాత తీయబోయే సినిమాను తక్కువ మొత్తానికి ఇవ్వడానికి పవన్ నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Sardaar Gabbar Singh  Collections  

Other Articles