పబ్లిక్ గా అంత పనిచేసిన బాలయ్య | Balakrishna Smoking in Public

Balakrishna smoking in public

Balakrishna Smoking in Natchathira Cricket Match, Balakrishna, Smokes, నందమూరి బాలకృష్ణ, స్మోకింగ్, సినిమాలు, క్రికెట్, Natchathira Cricket Match, Movie News, News, stills, gossips, spicy, politics, రాజకీయాలు, ఫలితాలు, ఇంటర్మీడియెట్, Inter results

Balakrishna Smoking in Public: Tollywood star actor Nandamuri Balakrishna Smokes at Natchathira Cricket Match in 17 April.

పబ్లిక్ గా అంత పనిచేసిన బాలయ్య

Posted: 04/19/2016 11:04 AM IST
Balakrishna smoking in public

ఈమధ్య నందమూరి బాలకృష్ణ ఏంచేసినా కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. ఆ మధ్య ‘విశాఖ ఉత్సవ్ 2016’ కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ పాల్గొని పొగాకుపై పెద్ద కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ‘నేను ప్రొద్దున లేవగానే చుట్టకాలుస్తాను. ఎందుకంటే గొంతుకోసం, ఆరోగ్యం కోసమంటూ చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగకుండా పొగాకు మీద ఒక పద్యం చెప్పి.. చివర్లో ‘పొగత్రాగనివాడు మరుజన్మలో దున్నపోతై పుట్టును... అంటే ప్యూర్ బఫెల్లో’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసాడు.

ఆ తర్వాత ‘సావిత్రి’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమంలో ‘అమ్మాయిల వెంటపడితే ఊరుకుంటారా ఫ్యాన్స్.. ఊరుకోరు కదా! వెళ్లి ముద్దు అయినా పెట్టాలి లేదా కడుపైనా చేసేయ్యాలి... కమిట్ అయిపోవాలి’ అంటూ మాట్లాడి తెలుగు ఆడపడుచుల ఆగ్రహానికి, అదే విధంగా రాజకీయపరంగా కూడా పలు విమర్శలకు గురయ్యారు. అయితే తాజాగా పబ్లిక్ గా చుట్టకాలుస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు.

ఈనెల 17న నడిగర్ సంఘం ఆధ్వర్యంలో సినీతారల క్రికెట్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో తమిళ సినీ ఇండస్ట్రీ తారలతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం సిని ఇండస్ట్రీలకు చెందిన పలువురు అగ్ర నటీనటులు పాల్గొన్నారు. ఈ వేడుకలో బాలయ్య కూడా పాల్గొని తెగ హల్చల్ చేసారు. అయితే ఈ కార్యక్రమంలో బాలయ్య చొక్కా విప్పేసి, సిగరెట్ కాలుస్తూ క్రికెట్ ఆటను వీక్షిస్తున్న సమయంలో తీసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

ఈ విషయంపై తెలుగు ప్రజలతో పాటు సౌత్ ఇండస్ట్రీ ప్రజలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు బాలయ్యపై పలు విమర్శలు చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే స్థానంలో వుండి, పబ్లిక్ గా అలా చొక్కా విప్పేసి, సిగరెట్ తాగడం సరైన పద్థతి కాదని.. బాలయ్యపై విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. బాలయ్య స్మోకింగ్ చేస్తున్న సమయంలో పక్కనే నటులు విజయ్ కుమార్, శివరాజ్ కుమార్ లతో పాటు పలువురు సినీ నటులు కూడా వున్నారని పట్టించుకోకుండా... ఇలా స్మోక్ చేయడంపై సౌత్ ఇండస్ట్రీకి చెందిన సినీ జనాలు బాలయ్యపై విమర్శలు చేస్తున్నారు. మరి ఈ విమర్శలకు బాలయ్య ఎలా స్పందిస్తాడో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Smokes  Natchathira Cricket Match  

Other Articles