‘సరైనోడు’ సెన్సార్ పూర్తి.. ఏప్రిల్ 22న విడుదల | Sarrainodu Censor Report

Sarrainodu censor report

Sarrainodu Censor Report, Allu Arjun, Sarrainodu, అల్లు అర్జున్, సరైనోడు, రకూల్ ప్రీత్ సింగ్, Rakul Preet Singh, Boyapati Srinu, రాజకీయాలు, వార్తలు, సినిమాలు, ఫోటోలు, Sarrainodu posters, stills, News, hot, gossips

Sarrainodu Censor Report: Stylish star allu arjun latest film Sarrainodu will be release on 22 April. Boyapati Srinu Director, Thaman music, Rakul preet singh heroine.

‘సరైనోడు’ టాక్ ఇదేనట!

Posted: 04/19/2016 10:14 AM IST
Sarrainodu censor report

‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘రుద్రమదేవి’ వంటి హిట్ చిత్రాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ‘సరైనోడు’. టైటిల్ కు తగ్గట్లుగానే ఇందులో అల్లు అర్జున్ పర్ఫెక్ట్ బాడీతో, స్టైలిష్ మాస్ లుక్ లో అదరగొడుతున్నాడు. ‘సింహా’, ‘లెజెండ్’, వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ఈ ‘సరైనోడు’ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

‘సరైనోడు’ను టెన్షన్ పెడుతున్న ‘దమ్ము’

థమన్ సంగీతం అందించిన పాటలు, వీడియోలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులోని బ్లాక్ బస్టర్ సాంగ్ చాట్ బస్టర్స్ లో టాప్ 10 స్థానంలో నిలిచింది. అయితే తాజాగా ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డ్ సభ్యులు ‘సరైనోడు’కు U/A సర్టిఫికెట్ ను అందజేసారు. అలాగే సెన్సార్ బోర్డ్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

రకూల్ ప్రీత్ సింగ్, కెథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, మలయాళం భాషలలో గ్రాండ్ ఏప్రిల్ 22న విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను కొల్లగొట్టి, ఎంత కలెక్షన్లు రాబట్టనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Sarrainodu  Allu Arjun  Rakul Preeti Singh  

Other Articles